అనుభవసారం: మార్గదర్శనం వచనకవిత
అనుభవసారం: మార్గదర్శనం వచనకవిత


అనుభవసారం: మార్గదర్శనం వచనకవితా- సౌరభం
మేల్కొంటిమి బ్రహ్మముహుర్తాన -పరీక్షలకుసిద్ధమౌతిమి
పెరిగిందిధారణ శక్తి -పాటించితిమి సమయ పాలన యుక్తి
రెండవశ్రేణిలో ఉత్తీర్ణుడనైతిని-జీవితసమరాన పోరాడితిని
దైవకృపచే ,సమాజాదరణచే స్వశక్తిచే ఉద్యోగాన అనుభవాన్ని గడించితిని
ప్రవృత్తినందు కూడా ఒక్కొక్క మెట్టునెక్కుతూ శిఖరానికి చేరువవుతున్నా
ఈ లలితకళలందు కూడా చిన్ని ప్రవేశముచే ఆనందాన్ని పొందుతున్నా
మరి యువకులు, విద్యార్థులు అభివృద్ధికిబాటలు వేసుకుంటున్నారా?
వారు జీవన లక్ష్యానికి చేరువ అవుతున్నారా? పరీక్షల కాలంసమీపించే
గగన చుంబిత విజయాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారా?
శ్రద్ధాసక్తులచే కఠోర శ్రమచే నియమానుశాసనలచే పరీక్షలలో విజయముచే
శి క్షణ నిచ్చిన సంస్థలకు, శిక్షకులకు మంచి పేరును తేవడానికి సిద్ధమౌతున్నారా?
ఈ మార్గాన్ని అవలంబిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు కదా !!!!
పరీక్షలువ్రాసేవారికి, ఇంటర్వ్యూలకువెళ్లేవారికి అభినందనల శుభాశీస్సులు.
@@@@@