STORYMIRROR

Kadambari Srinivasarao

Abstract

3  

Kadambari Srinivasarao

Abstract

అంశం: ప్రాణ వాయువు

అంశం: ప్రాణ వాయువు

1 min
314

శీర్షిక: జీవ పటం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

జీవ గాలిపటం 

ఊపిరి దారాన్ని పట్టుకుని

నిత్యం స్వేచ్ఛా వాయువు చట్రంలో

నిరంతర భ్రమణం


సరిపడు గాలి అందినంతవరకు

గాలిపటం కళకళలాడుతూ

వీనుల విందు చేస్తుంది


అనారోగ్య పెనుగాలి వీచిందా

చిల్లుపడి ఆయువు తీరి

రెక్కలు విరిగిన పక్షిలా

నేల కూలుతుంది


గాలితోనే తన జీవం, జీవితం

ముడిపడి ఉందని తెలిసీ వెర్రవీగే

పొగరుపట్టిన జీవ పటం

పంచ భూతాల జీవన నాటకం

గాలి అందని నాడు 

గాల్లో కలిసిపోతుంది


Rate this content
Log in

Similar telugu poem from Abstract