అన్నోన్యదాంపత్యం
అన్నోన్యదాంపత్యం
మనసింటి ప్రేమవు నీవు,
ప్రేమకు ఊపిరి నీవు,
ఆలి ఆవేదన చూడలేని
మమత నిండిన మనసు నీవు,
పెదవులపై ప్రేమాలయం కట్టిన శిల్పివి నీవు,
జీవన మధురిమకు మౌనమంత్రమై నిలిచావు,
మురిపించే చిరునవ్వువై
శ్రీమతి అనురాగపు వీణవైనావు.
నగువులతో మగువను గెలిచిన మగధీరా
నీపాదపూజే అభిమానపు ధనమయ్యా,
మనసుతో మనసుకు చేసే
ఆరాధనమే
నా ఆశకు వరమే కావాలయ్యా,
ఆరోగ్యం అడ్డంకిగా మారినా
అలసిపోని అనురాగానికి కంటికి రెప్పలా వుందామయ్యా,
భర్తంటే బ్రతుకులోని బంధమే కాదయ్యా
గుండెలో దాగిన ప్రేమకు రసాకృతి మనదయ్యా.
ముచ్చటగొలిపే అన్నోన్యతే
ఏడేడు జన్మల పుణ్యఫలమందాము,
పులకింతల మల్లెల పరిమళాలకు
మన ప్రేమ ఊసులే వినిపిద్దాము,
పరిహాసపు పెదాలను
పాయసాన గరిటగా భావిద్దాము,
పాలు పంచదార మధురామృతాన్నే
మన హృదిగా మార్చుకుందాము,
పెదవి నీవుగా పదము నేనుగా
ప్రణయగీతపు మధువుగా వసుధలో వుండిపోదాము.

