STORYMIRROR

Ramesh Babu Kommineni

Inspirational

4.8  

Ramesh Babu Kommineni

Inspirational

అన్నీ ముఖ్యమే

అన్నీ ముఖ్యమే

1 min
268


ప౹౹

ఏమిటో ఏమిటో చెప్ఫు ముఖ్యనిర్ణయం 

ఏ నిర్ణయమైన తేవాలి తదుపరి జయం ౹2౹

చ౹౹

ముఖ్య నిర్ణయానికి మూలం నిశ్చయమే

ఒక్క కారణం చెప్పలేనట్టి ఓ సంశయమే ౹2౹

జీవితంలో నిర్ణయాలూ ఎన్నని చెప్ఫను

కాగితంలో రాయలేదే ఎలా ఒప్పచెప్పను ౹ప౹


చ౹౹

అవునన్నా ఓ నిర్ణయమేగా లెక్కించనూ

కాదన్నా కూడ నిర్ణయమేగ పరికించనూ ౹2౹

వాటిలో ముఖ్యమైనది ఎలా గుర్తించను

వాడుకలో ప్రత్యేకతను ఎలా తగ్గించను ౹ప౹


చ౹౹

ఎంచలేదు ముఖ్యమైనదని తక్కువదని

కించపరచరాదే దేనినో చేసి ఎక్కువదని ౹2౹

అన్ని నిర్ణయాలు ముఖ్యమైనవే తెలుప

కొన్ని ఫలితాలే తెస్తాయిలే కొత్త మలుపు ౹ప౹



Rate this content
Log in

Similar telugu poem from Inspirational