అందమైన కలవు
అందమైన కలవు
నా కనులు ఎపుడూ చూడని
అందమైన కలవు నీవే...!!
నా ఊహలో ఎల్లప్పుడు మెదిలే
అందమైన రూపం నీదే..!!
నా పెదవులు ఎపుడు పలికే
తీయని పలుకు నీపేరే...!!
నా మదిలో నిరంతరం మెదిలే
తీయని తలపు నీదే...!!
నా మనసంతా నిండిన
ప్రేమానుబంధం నీవే....!!
నాలో నిండిపోయి
నన్ను నాకు కొత్తగా పరిచయం చేస్తూ
నా మనసును ఆహ్లాద పరిచే
మరుమల్లియల పరిమళం నీవే... !!!!!!

