అందాల మనసు
అందాల మనసు
ఎవరివే నీవు
ఏమని పిలవాలి నిన్ను,
అనుబంధపు పూదోటలో
వికసిత విరుల నవ్వువా,
పరుగులు తీసే పరువపు కోరికల
ఆనంద రాగానివా,
మదివీడని ప్రియభావపు ప్రేమఊసువా,
కవ్వింతల మాటలతో అల్లుకునే చిగురు తొడిగిన కోరికవా,
ప్రేమ దారుల్లో నడిచేటి
అనంత అద్భుత రూపానివా,
తాపాలను చల్లార్చగా
వరమాలతో వచ్చిన
సౌందర్య రాశివా
ఎవరివే నీవు,
ఏమని పిలవాలి నిన్ను.
ఆనందానికి చిరునామా నేను,
ఆత్మీయతే ఆరవ ప్రాణమంటాను,
మాయలోకంలో
మనసు తెరల చాటు మనిషిని చూస్తాను
అందాల హృదికి గుండెలయగా వుంటాను,
స్వచ్ఛమైన ప్రేమకు తీపితోడై అనుబంధానికి వెలుగునీడనౌతాను,
చెప్పుకున్న ఊసులలో మమతనే చూస్తాను,
అలవిగాని ఊహలను ఆదిలోనే తరిమేస్తాను,
మమకారపు పరమాన్నంతో నిత్యం మాధుర్యాలే పంచుతాను,
తలపులలోని సుందరాంగుడి పట్టినచేయి వీడక నూరేళ్ళు కన్నుల్లో కాపురముంటాను,
మనసున పుట్టిన మధురభావంతో
నను పిలవమంటాను,
మనసును మనసుతో
ముడిబంధమే కోరుకుంటాను.

