అందాల చందమామ
అందాల చందమామ
అందాల చందమామ ఇదిగోవే నీ చిరునామా
ఎదురొచ్చి చెయ్యే చాచి పిలిచానే
నీ కలలకు రంగులు పూసి నీ లోకం తలపులు తీసి
ఈ మమతల గూటికి నిన్నే చేరెనే
ఇన్నాళ్లు ఎక్కడ ఉందో వసంతం తక్కువ వచ్చి
నీ సొంతం కావాలి ముద్దుగా నదిచిరావే గడపదాటి
మరిచి నీ గతమే ప్రియమర చేయే చాచి పిలిచేనే
వెలుగు చూడని కోణంలో మెరుపు వానలు కురిసేలే
ఆశలెరుగని మనసులో ప్రేమ మొలకలు వేసేనే ||
ఎకాకి నడకకు ఓ తోడు చేరి సాగింది ఆగని గమనమే
కొండంత బాధను నాలుగుసంత చేసి చిరునవ్వు పూసెను పెదవిపై
మొడైన కొమ్మలన్నీ పచ్చని పూత పూసి చేసాయి సంతోషాల వేడుకే
అలలు ఎరుగని సరసులో కలలు సవ్వడి చేసేనే
మూగ బోయిన తీగలో మౌనరాగం పలికేనే
ఏ కంటిపాపో తానూ నీ ఇంత దీపమెట్టి అల్లింది
అందమైన బంధమే ఈ చిన్ని గూటిలో ఆ వెన్నెలమ్మగా చుట్టురా
వెలుగులు చిమ్మేనే ఆ గువ్వ గోరువంక ఓ గూడు కట్టినట్లు
బాగుండి వీరి వింత కలయికే....
... సిరి ✍️

