అమ్మా
అమ్మా
మరణమే చేరువవ్వని..
ప్రళయమే విధ్వంస రచన చేయని..
విశ్వమే చిన్నచూపు చూడనీ..
అయినా.. భయమేల..
నీవున్న వరకు ఇవి ఏవి నన్ను తాకనివ్వవు..
నీతో ఉన్న వరకు ఈ భయము నన్ను చేరనివ్వవు..
ఆనందం వరం ఇచ్చింది..
అనుభందం మన ఇద్దరినీ కలిపింది..
ప్రేమతత్వం నీ రూపం అయ్యింది..
నీ ఒడిలో నా మనసు..
పసిపాపలా సేద తీరుతుంది..
కనుపాపలా రక్షణ కోరుకుంటుంది..
సంగీత స్వర వేద సుస్వర డంకా నాదం నీ రూపం..
ప్రేమ పలుకుల మనసు మురిపముల సౌందర్య విరచితం నీ వదనం..
సృష్టి స్వరూప ధైర్య నిర్వచన ఆనంద బంధం నీ అనుభందం..
అమ్మా..
నీవే నా ప్రతి శ్వాస..
నువ్వే నా సర్వస్వం..
ఈ జన్మలో చేసిన పుణ్యమో నీ బిడ్డ అయ్యాను..
దైవం.. నీ రూపం..
ప్రేమ.. స్నేహం.. ఆనందం.. ధైర్యం..
అన్ని నువ్వే..

