అమ్మా ♥️♥️♥️
అమ్మా ♥️♥️♥️
సృష్ఠిలోని తియ్యదనం..
ప్రేమలోని కమ్మదనం..
వెల్లువిరిసిన ఆనంద వదనం..
అమ్మా..
ప్రసవవేదనే ఆనంద భాష్పమై..
భరించలేని భాధ మరో ప్రాణమై..
తన దేహం మరో రూపంగా..
సృష్ఠికి జీవం పోసే దేవత..
అమ్మా..
బిడ్డ కోసం చేసే త్యాగం..
అమ్మకి ఆనంద గమ్యం..
బిడ్డ భవిత కోసం..
అమ్మ పడే తపన..
ఎప్పటికి తీర్చుకోలేని రుణం..
మధుర బంధం..
ఎంత చెప్పినా తరగదు..
ఏమి చెప్పినా సరిపోదు..
అమ్మ ప్రేమని వర్ణించ సాధ్యమా..
ఆ అమ్మకి అమ్మనై..
తన కంట మన వల్ల కన్నీటి బిందువు రానివ్వకుండా చూసుకునే వరం కోరుతున్న..
మాతృదేవోభవ..
రేపటి ఆదివారపు మాతృ దినోత్సవ వేడుక..
ప్రతి ఒక్కరికి అమ్మ ప్రేమ మధురపు దీపిక
