STORYMIRROR

Anjani Gayathri

Inspirational Others

4  

Anjani Gayathri

Inspirational Others

🌹అమ్మ ప్రేమ 🌹

🌹అమ్మ ప్రేమ 🌹

1 min
278


     అమ్మప్రేమ -కవిత.

  🌹✨️🌹✨️🌹

రచన :-అంజనీగాయత్రి 


 కష్టాల కడలిలో కూడా అమృతాన్ని పంచేది అమ్మ... !!

 కన్నీళ్ళ సుడుల లో కూడా ఆనందాన్ని పంచేది అమ్మ.... !!

 కనురెప్పలు కళ్ళను కాపాడినట్లు మనల్ని కాపాడేది అమ్మ... !!

 పువ్వు రేకులకు తొడిమ రక్షణ కవచంలా ఉన్నట్లు మనకు రక్షణ కవచంలా ఉండేది అమ్మ.... !!

 పువ్వు వికసించడానికి మొక్క ఎలా ఆధారం అవుతుందో మనకు ఎదగడానికి ఆధారం అయ్యేది అమ్మ... !!

 మొక్క ఎలా అయితే పుష్పించి మనకు ఫలాలని ఇస్తుందో అలా మన అవసరాలు తీర్చేది అమ్మ... !!

 అడగకుండానే ప్రకృతి మనకు అన్ని కాలానుగుణంగా ఇస్తుంది. అలాగే ఏ దశలో మనకు ఏది అవసరమో తీర్చేది అమ్మ... !!

 అందుకే ప్రకృతి ఎంత సహజసిద్ధంగా ఉంటుందో అలా తన సహజ గుణాలతో అలరారుతుంది అమ్మ... !!

 ప్రేమను పంచేది.... ప్రేమను పెంచేది అమ్మ.... !!

 🌹✨️🌹🙏🙏✨️🌹


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational