అమ్మ ఒడిన
అమ్మ ఒడిన
అమ్మ ఒడిన సేదదీరు ఙ్ఞాపకాలు మరువ వద్దు
వడలిపోవు ఎండుటాకు మనసు కొమ్మ ఊపవద్దు..
కన్నవారి కలలు పంట నీవేనని పొంగిపోయె
వెలుగు నిచ్చు తారకలకు అమావాస్య చూపవద్దు
నాన్నంటే గుంభనంగ. ప్రేమ చూపు సముద్రుడే...
గాయపడగ. గుండె తడుము విలంబనం చేయవద్దు
వెన్నెలవే చిన్నబోయె అమ్మ చూపు కాంతులతో..
ఆ మనసును డబ్బు తోటి లెక్కలంటు వేయవద్దు..
ఏ పాపం,ఏ పుణ్యం ఎవ్వరెరుగు ఓ సిరీ
కనిపించే దైవాలను కఠినంగా తిట్ట వద్దు..

