అల్లం టీ
అల్లం టీ
హాయిగొల్పు కమ్మనిరుచి..పంచునులే అల్లం టీ..!
రోజుకొకటి రెండుమార్లు..చాలునులే అల్లం టీ..!
సరిగ దంచి మరిగించి..పాలు బెల్లం కలిపితే..
ఉత్సాహం ఉల్లాసం..నింపునులే అల్లం టీ..!
మరిగే టీ అల్లంనీళ్ళకు..తేనే నిమ్మ కలిపి..
సేవిస్తే వికారాలు..నిలుపునులే అల్లం టీ..!
ఇమ్యూని'టీ' శక్తినే..ఇనుమడింప జేసేనోయ్..
ఆరోగ్యం ఆనందం..కాచునులే అల్లం టీ..!
గ్రీన్ టీలో సబ్జాగింజలజత పుదీనా తులసి..
నోటికిరుచి శుచిఎంతో..పెంచునులే అల్లం టీ..!
ఎంతగొప్ప మందంటే..మాటలేల సరిపోవును..
బద్ధకాన్ని భలేబాగ..తరుమునులే అల్లం టీ..!
