అలక
అలక
ఇటుతిరిగి నవ్వితే..సొమ్మేమి పోయేను..!?
అలిగి అటు తిరిగితే..అసలేమి ఒరిగేను..!?
సరదాగ ప్రాణాలు..తియ్యడం బాగులే..
చూపొకటి విసిరితే..చిక్కేమి వచ్చేను..!?
ఏ జన్మ బంధమో..లాగె'నా మనసునే..
గంధాల వానలో..దారేల దొరికేను..!?
ప్రశ్నించు తత్వమే..నిజశక్తి వరదాయి..
చీకట్లు తొలగించు..దివ్వెగా మారేను..!
ఆధిక్యతా కాంక్ష..యుద్ధాల ద్వారమది..
మూఢమతు లాటలను..సత్యమే తేల్చేను..!
ఈ పండు కాలమే..రాల్చునే కర్మములు..
శ్వాసతో కాపురము..శాంతమై మిగిలేను..!

