అలా నువ్వు
అలా నువ్వు
అలా నువ్వు నవ్వుతుంటె..చూడటమే ఇష్టం..!
నిన్ను గూర్చి పాటలాగ..మిగలటమే ఇష్టం..!
ప్రపంచ మేమైతేనేం..అనుకోలే నీపై..
మన చుట్టూ ఈ విశ్వం..తిరగటమే ఇష్టం..!
ఏమైనా చేసేద్దాం..ఒక స్నేహం కోసం..
సేవన్నది లేదు నిజం..చెప్పటమే ఇష్టం..!
కష్టమెవరి కనిపించునొ..తప్పదులే నష్టం..
దూరాలో భారాలో..తీర్చటమే ఇష్టం..!
ప్రేమ గాక మరోమతం..లేదన్నది సత్యం..
అక్షరాల మౌనమధువు..పంచటమే ఇష్టం..!

