అక్షరమాల వర్ణన
అక్షరమాల వర్ణన


అ - అద్భుతానికై ఆకాశానికి చూసే చూపు!
ఆ - ఆనందానికై అవనిపై వేసే అడుగు!
ఇ - ఇష్టం తో ఇతరులకు చేసే సహాయం!
ఈ - ఈతరపు యువతకు ఇచ్చే సందేశం!
ఉ - ఉన్నత స్థాయి కి చేరే ఆలోచనా!
ఊ - ఊహలకు మాత్రమే పరిమితమా!
ఋ - ఋతువులు ఎన్ని మారుతున్నా!
ఎ - ఎంత నేర్చుకున్నా మిగిలివున్న జ్ఞానమా!
ఏ - ఏకాకిలా ప్రయత్నిస్తే సాధ్యమా!
ఐ - ఐకమత్యంతో పోరాడితే అసాధ్యమా!
ఒ - ఒడిదుడుకులకు కలత చెందే నేస్తమా!
ఓ - ఓపికతో వుంటే జయము కలగదా!
ఔ - ఔరా అని లోకము అబ్బురపడదా!
అం - అందరిలో కాకుండా అందరితో జీవించుమా!!