STORYMIRROR

Kadambari Srinivasarao

Inspirational

4  

Kadambari Srinivasarao

Inspirational

అక్షర హాలికుడు

అక్షర హాలికుడు

1 min
250

కొవ్వొత్తిలా కరిగిపోతున్నా 

జ్ఞాన వెలుగులందిస్తూ

అజ్ఞానపు చీకట్లు తొలగించి 

జగతిని జాగృతం చేసే 

జ్ఞాన భాస్కరం అతడు


శిష్యగణ మెదడు పొలంలో 

అక్షర విత్తులు నాటి

పదాల రాశులతో 

వాక్యాల పంటను నిర్విరామంగా పండించే 

అక్షర హాలికుడు అతడు


జ్ఞాన చమురు నింపి

శిష్య రథాన్ని ప్రగతిబాట పట్టించి

గెలుపు తీరాలకు చేర్చే 

రథ సారథి అతడు


కఠినమైన కార్యమైనా

చెంత చేయుతగా నిలిచి

నేర్వడంలో వేసే తప్పటడుగులను                     సరిచేసే మాతృమూర్తి అతడు


నాలుగు మూలల మధ్య నడత నేర్పి 

నలుదిశలా విస్తరింపజేసే

తరిగిపోని విలువల సంపదనందించే

జ్ఞాన కల్పతరువతడు


అభ్యాస జీవితాన్ని గాడిలో పెట్టి

చక్కదిద్దడంలో పితృసమానుడై

బతుకు బండిని క్షేమంగా 

గమ్యం చేర్చే మార్గదర్శి



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational