STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance

4  

ARJUNAIAH NARRA

Romance

ఐస్క్రీమ్లాంటిజీవితం

ఐస్క్రీమ్లాంటిజీవితం

1 min
683

నీవు చేసినదానికి 

నిన్ను ప్రత్యేకంగా 

శిక్షించాలి అనుకోలే,

అలా అని నీ నుండి

దూరంగా పోదామనుకోలే

నన్ను అర్థం చేసుకుంటే అదే చాలు అనుకున్న


నిన్ను ప్రేమించినా వారిలా 

ప్రేమించడం నా వల్ల కాదేమో

నా ప్రేమ కంటే నిన్ను అంతలా

మైమరిపించిన ప్రేమను మించి 

ప్రేమించలేకపోవడం నా వల్ల కాక పోవచ్చు


అదే ప్రేమను నీకు నేను కానుకగా

నీవు కావాలంటే తెచ్చి ఇవ్వగలనా?

నా మనసేరిగిన వాడివి

నా మనసేరిగిన దానిని 

నాకు నీవు తెచ్చి ఇవ్వగలవా?


నాకు కావలిసినది నాకు ఇస్తే చాలు అనుకున్న

నా మనసుకు నచ్చింది నాకివ్వలేవా?

నీవు స్వీకరించి, నన్ను వద్దని అంటే నీకు న్యాయమా

నీవు స్వీకరించినది మళ్ళీ నీకు తెఛ్చివ్వమంటావా?

నాకు ఇస్తానని మాట ఇచ్చినావు

ఒప్పుకున్న వాడివి ఒప్పుకున్న దానిని 

ఒప్పచెప్పలేక తప్పుకుంటే 

తప్పులు ఒప్పులవుతాయా?


అందుకే ....

నన్ను మన్నించి, నా కోరికను గౌరవించి

నీ మనసు పొరలు దించి, అడ్డుతెరలు తెంచి

నన్ను ఆహ్వానించి, నీవు తిన్న తియ్యని ఐస్క్రీమ్

జీవితపు మంచు ముక్కను నాకు పంచు

నాతో కూడి నాకు ఆనందము కలిగించుము....



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance