ఆత్మీయత
ఆత్మీయత
ఆత్మీయత రుచి తెలిసిన..హాసమంటె నీదే'లే..!
వెన్నెలనే మరపించే..స్నేహమంటె నీదే'లే..!
జన్మకథల కావ్యనిధిని..వదలలేని తనమదేల..
మనసు గుట్టు రట్టుచేయు..ధర్మమంటె నీదే'లే..!.
గుండెతడిని చూడగల్గు..కనులుంటే లోటేమిటి..
అనురాగం వర్షించే..రాగమంటె నీదే'లే..!
చేతిలోన చేయివేసి..మాయమైన వైనమేమొ..
ప్రేమకు నిర్వచనమైన..హృదయమంటె నీదే' లే..!
కన్నులింటి కోవెలలో..కొలువయ్యిన కరుణామయి..
మౌనామృత మేఘమాల..రూపమంటె నీదే'లే..!

