Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

murali sudha

Abstract Inspirational

4  

murali sudha

Abstract Inspirational

ఆత్మ నిర్భర్

ఆత్మ నిర్భర్

1 min
589


ఆత్మనిర్భర్.....


1. ఎవరొచ్చి కుమ్మరించి పోయారు ఈ రాత్రిని

రెక్కలు విచ్చుకునే వెలుగు నాకిప్పుడు కావాలి

పగటి నిశి తరిమేసిన రోజుని

నేను మళ్ళీ కలుసుకోవాలి....


2. ఎక్కడినుంచో వలసవచ్చే ఈ రవికిరణాల వల్ల 

ఏ ఫలితమూ పలకరించడం లేదు

అంతఃకారణాలని కారణం కనిపెట్టమనాలి


3. ఎన్నెన్ని యుద్దాలు చేసినా ఎక్కడా పరిపక్వత 

పట్టుకోలేక పోయాను

ఇక అలసత్వాన్ని విసిరికొట్టి

ఆత్మనిక్కడకు పిలుచుకు రావాలి


4. ఏమాత్రం స్పృహలేని ప్రతిస్పందనల

ప్రకోపాన్ని పరిమితం చేసుకుంటూ

నిస్పృహ రంగుకు ఏ పదిసార్లో మేకప్ చేసి తొలగించుకోవాలి....


5. ఏ అగోచర గోరీలోనో ఇరుక్కున్న నా దేహాన్ని నా దాహాన్ని

వసపిట్టను చేసి ఊరిమీదకు వదలాలి....

"నేను" నేనుగా వినిపించి , కనిపించాలి

నాకు నేనుగా మిగిలి, ముగిసిపోవాలి


సుధామురళి


Rate this content
Log in

Similar telugu poem from Abstract