ఆశలు చిగురించిన వేళ...
ఆశలు చిగురించిన వేళ...
నీ మాటోక వేద మంత్రమైంది...
నీ బాటొక రాచబాటైంది...
నీ నవ్వొక హరివిల్లైంది...
నీ చూపొక వెన్నెల కిరణమైంది...
ఆనాడు నవ్వో చెక్కని శిల్పవానివే...
ఆస్వాదించానే నాడు...
నీ సహచర్య పరిమళాలను....
జీవన పయనంలో సుమాలుగా మలచుకొని...
అందుకేనేమో....
అమాస చందురూడువైనా...
నాటి మరు మల్లెల ఎదను...
అనురాగ భాంధవ్యాన్ని తలపోసుకుంటూ...
గడిపేస్తున్న నేడు...
నీ ఓర కంటి మెరుపు నా పై మెరిసినంతనే...
మునుపటి శ్రావణ పౌర్ణమి తొంగి చూస్తూ...
నాలో మేల్కొన్న ఆశలు చిగురించిన వేళ...
నిరీక్షిస్తున్నా తూరుపు ఉషస్సునై...!!!

