ఆశలతీరం...
ఆశలతీరం...
కన్నులకంటిన తడిని తుడిచేసి
గుండెలనంటిన జ్ఞాపకాలని చెరిపేసి
అడుగులకే అందనంతదూరం నన్నేనేను వెలివేసి
సాగుతున్నా తిరిగితిరిగి చేరుతోంది నీవులేని శూన్యం
అయినా ఇకపై అది నాగమ్యం
వెనుతిరిగి రాలేనిది నాపయనం
మళ్ళీమళ్ళీ వెతుకుతోంది చేరలేని ఆశలతీరం

