ఆరాటం
ఆరాటం
వట్టి చేత్తొ వచ్చావూ ఎందుకంత ఆరాటం
వట్టిచేత్తొ పోతావూ ఎందుకంత ఉబలాటం
ఏమివెంట తెచ్చావని ఆర్జించాలను కోరిక
మనుషులతో అదేపనిగ ఆడకోయి చెలగాటం
మానవునిగ పుట్టావూ సార్ధక్యం చేయాలీ
మనిషిలాగ మారడానికెందుకోయి మొహమాటం
నీచబుద్ధి కలవాడికి మంచిచెప్పిన దండగే
దేవుడుదిగి వచ్చిననూ ఎపుడురాదు గుణపాఠం
నీపరిధిలొ నీవుంటే జీవితానికో అర్ధం
గీతదాటి వచ్చావా కదిలిపోవు నీపీఠం
