ఆమె
ఆమె
ఒకసున్నిత సౌమనస్య..సంశోభిత ఆమె..!
గజల్ రచనాంకితపుష్ప..సంపూజిత ఆమె..!
గాయపడిన గుండెచాటు..గేయధార నిధియె..
విశ్వప్రేమ తత్వసుధా..నిజవర్షిత ఆమె..!
మాయామర్మము లెరుగని..మందహాస ఖనియె..
మౌనాద్భుత స్నేహామృత..ప్రాసాదిత ఆమె..!
సహస్రదళ కమలాసన..లావణ్యయె తానె..
బీజాక్షర యోగధునీ..ప్రాయోజిత ఆమె..!
కనుపాపల హృదయభాష..వివరించే నయన..
జగదానంద కారక..పదశింజిత ఆమె..!
ప్రయోగ కుశలత సాక్షిగ..నిలిచే పరాశక్తియె..
సమయోచిత విరాగ మది..సంప్రేరిత ఆమె..!
