ఆఖరి మాట
ఆఖరి మాట


ప౹౹
ఆఖరి ఉత్తరం రాస్తున్నా అర్థం చేసుకో
లేఖరిగా గుర్తించి ఉత్తరాన్ని దాచేసుకో ౹2౹
చ౹౹
కోరి చెపుతున్నా కోపించకు ఓ కోమలి
పురి విప్పి నర్తించే ఆ మరులు నెమలి ౹2౹
సన్నని సరసం మదిలో అంకురించెనే
మొన్ననే తలచి తనువే పులకరించెనే ౹ప౹
చ౹౹
అరుణిమ అద్దిన మోము చూసేందుకు
తరుణమొకటి తారసపడే రాసేందుకు ౹2౹
కుశలమేగా కోయిల రాగాలే విన్నాకను
లేశమైనా సంశయం లేదుగా కన్నాకను ౹ప౹
చ౹౹
ఎన్నడో విరిసినా వలపు కుసుమం ఇది
మరెన్నడు కాబోదే గగనకుసుమం అది ౹2౹
అందుకొన్నాక ఈ ఉత్తరం ఆనందించనే
అందుకోను రావా వలపు అందించగానే ౹ప౹