ఆకాశం
ఆకాశం
ఊహలకు రెక్కలొస్తే
భావవిహంగాలై విహరిస్తొయి
గగనసీమను గమ్యంగా చేసుకుంటాయి
గమ్యం గమనం రెండింటిని వెదుకుతూనే ఉంటాయి
తీరంచేరని నావ నడిసంద్రాన ఊగిసలాడుతుంటుంది
కాలగమనానికి ఎదురు నిలుస్తూ
అంతంలేని జీవనయానానికై ఆరాటమెందుకో
అలసిసొలసిన హృదయానికి ఊరటనిచ్చేదెప్పుడో హృదయానికి ఊరటనిచ్చేదెప్పుడో
జీవితమంటే జీవింపజేయాలని
ప్రేమించడమంటే ప్రేమను పొందడమే
అదొక అవకాశవాదం
అదెప్పటకీ అందని ఆకాశం.

