STORYMIRROR

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

ఆడపిల్లలు -అవనికే సిరులు

ఆడపిల్లలు -అవనికే సిరులు

1 min
378


ఆడపిల్లలన్ ధరణిలో నలుసు చేసి

మాట లాడుచు వెకిలిగా మసలు కొనుచు

తూలనాడెడి దుర్మార్గ దుష్టు లిపుడు

పెరిగి పోయిరి సంఘపు పరువు తీసి.


ఆడపిల్లకు రక్షణేదీ అవని యందు

అదను చూచి భక్షించు వారినేమందు?

కిరాతక పిశాచ కీచకాధములు 

కర్కశ రాక్షసనీచ గణములు

కొలువు తీరిన లోకమున 

నెలత కెక్కడ సాంత్వన?

భయము గుప్పిట్లో గడుపుచునా

శ్రయము లేక బేంబేలు పడుచుండుటేనా?


ఏ ఒక్కరిదో కాదు బాధ!

మన బిడ్డల భవితకై వ్యధ!

ఆత్మ రక్షణకై యబలలు

అసమాన విద్యలు నేర్చుకోవలయు 

క్రూరమృగములను జయించగ 

క్రొత్త క్రొత్త పథకాలు రచించగ

ప్రభుత్వమూ ప్రజలు కలిసి

ఏరి ఏరి మట్టు బెట్ట వలయు

మహిళ రక్షణకై అహోరాత్రులు శ్రమించి

ఆకతాయిల ఆగడాలు నిలువరించ వలయు.

మహిళ రక్షణకై దేశప్రజ

కలిసి కట్టుగా కదలవలయు.

ఆడపిల్లల నవ్వులే

అవనికే సిరులు సంపదలు.

---------------------------



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational