Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

4  

SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

"ఆచార్య దేవోభవ!"

"ఆచార్య దేవోభవ!"

1 min
356


అక్షరాభ్యాసంతో నా విజయాలకి శ్రీకారం చుట్టి, నా ప్రతి విజయంలో తొలి సోపానముగా నిలిచింది నీ జ్ఞానామే కదా!

అందుకే, ఓ గురువర్యా...!

అందుకో నా ఆరాధన నీరాజనం "ఆచార్య దేవోభవ!"

సంద్రపు జీవితంలో ప్రతీ ఆటుపోట్ల ఒడిదుడుకలకు ఎదురొడ్డి నిలిచే దైర్యం, ఆనాడు నా చిన్న చిన్న పొరపాట్లును గుర్తించి సరైన మార్గంలో పెట్టిన నీ బెత్తపు దండనదే కదా!

అందుకే, ఓ గురువర్యా...!

అందుకో నా ఆరాధన నీరాజనం "ఆచార్య దేవోభవ!"

దారిలో పడివున్న రాయి లాంటి నన్ను రూపమున్న ఓ శిలగా మలచి, నువు పడిన ఆ శ్రమకు ప్రతిఫలం నా ఎదుగుదలను ఆస్వాదించడమేనన్నది నీ ఔదార్యమే కదా!

అందుకే, ఓ గురువర్యా...!

అందుకో నా ఆరాధన నీరాజనం "ఆచార్య దేవోభవ!"

అపరిపక్వ నిర్ణయాలతో చీకటి అలుముకున్న నా గమ్యానికి,

కాంతిని ప్రసరింపచేసి, దిశానిర్దేశ చేసింది నీ సలహాలు, సూచనలే కదా!

అందుకే, ఓ గురువర్యా...!

అందుకో నా ఆరాధన నీరాజనం "ఆచార్య దేవోభవ!"

పరుగులు తీస్తూ అలసిన నా దేహానికి, వెన్నుతట్టి ఊతమిచ్చినది నీ స్ఫూర్తిదాయక సూక్తులు, ప్రేరణనిచ్చే పంక్తులే కదా!

అందుకే, ఓ గురువర్యా...!

అందుకో నా ఆరాధన నీరాజనం "ఆచార్య దేవోభవ!"

ఆనాడు మీరు నా మదిలో నాటిన ఆ అక్షరాలనే అమర్చి,

మీ యొక్క గొప్పతనాన్ని ఓ కవితలా కూర్చి,

ఆ భావాన్ని ఈనాడు ఈ ప్రపంచానికి వర్ణించతగగలనో లేదో!!

కానీ,

మీదైన ఈ రోజున గురు దక్షిణగా ఈ చిరుకానుక మీకందించాలని మీ శిష్యుడిగా నా ఈ చిన్న తపన.

తప్పులుంటే ఎప్పటిలానే మన్నించి మీ పెద్ద మనసుతో స్వీకరిస్తారని ఆకాంక్షిస్తూ...

"హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవం💐"

                        తమ విధేయుడుగా

                     ఎప్పటికీ మీ విద్య"ఆర్ధి" గా

                     సత్య పవన్ గంధం ✍️✍️



Rate this content
Log in

Similar telugu poem from Classics