అ ఆ ..
అ ఆ ..
అక్షరం తెలిసినా అజ్ఞానివై ఉండకు
ఆశ పడుతూ ఆనందాన్ని మరువకు
ఇలలో నీకు తోడు ఇతరులే కదరా
ఈర్ష్య వదిలి ఈ క్షణం జీవించు
ఉదార భావంతో నీ ఉనికిని చాటు
ఊపిరి నీవై ఊరట నింపు
ఎంత ఎత్తు ఎదిగినా మేలు ఎన్నడూ మరువకు
ఏమీ లేని ఏకాకివై పోకు
ఐశ్వర్యం కన్నా ఐక్యత మిన్నరా!
ఒడిదుడుకులతో ఒంటరిగా పోరాడు
ఓర్పు నిండిన ఓడవై ముందుకు సాగు
ఔదార్యంతో ఔన్నత్యం చాటరా
అంబరాన్నందుకునే అంశమేందుకురా
ఆహా ఈ భూమే స్వర్గమే కదరా !