మన అనుబంధం
మన అనుబంధం
1 min
132
''అమ్మ'' అనే పదంలో మొదటి అక్షరం నీవై
అమ్మ పంచే అనురాగాన్ని పంచుతూ
''నాన్న'' అనే పదంలో చివరి అక్షరమూ నీవై
నాన్నలా కంటికి రెప్పలా కాపాడుతూ
కొన్నిసార్లు ఆట్లాడుతూ
కొన్నిసార్లు పోట్లాడుతూ
నీతో గడిపిన ప్రతీ క్షణం మరపురానిది.
ఆనందం వస్తే రెట్టింపు చేసి
బాధ వస్తే ఓదార్పు నింపి
కష్ట-సుఖాల్లో స్నేహితునిలా తోడుండి
తప్పు చేస్తే శిక్షించి
మరో తప్పటడుగు వేయకుండా ..
నన్ను కాపాడిన నీకు కృతజ్ఞత ఎలా తెలుపగలను ?
చిరకాలం నిలిచిపోయే మన
అన్నా-చెల్లెలి అనుబంధం వర్ణనాతీతం .
మన అనుబంధానికి ప్రతీకగా
రాఖీ పౌర్ణమి శుభదినాన నీకు రాఖీ కట్టి
భగవంతుడు ప్రసాదించిన వరంలా నిన్ను భావిస్తూ
అనుక్షణం నీవు నాకు తోడుగా ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.