కళ్ళుండీ చూడలేని ఈ లోకం ..
కళ్ళుండీ చూడలేని ఈ లోకం ..
పేదరికం, లంచగొండితనం,
దొంగతనాలు, మానభంగాలు, హత్యలు,
కుల-మతాల పేరిట అన్యాయాలు, అక్రమాలు,
కుళ్ళు రాజకీయాలు, దోపిడీలు,
జాతి వివక్ష, ఆకలి చావులు ...
మానవ జీవితంలో ప్రతిరోజు వెలుగు చూస్తున్న
ఈ దుశ్చర్యలను రూపుమాపేది ఎవరు?
' ఇవన్నీ చూసుకోవడానికేగా ప్రభుత్వం ఉంది '
అనే ఊహాధోరణి నుండి మేలుకో నరుడా !
మార్పు నీతోనే మొదలవ్వాలి ..
నీవు మాత్రమే వీటిని రూపుమాపగల ధీరుడవు
" నా ఒక్కడి వల్ల దేశం బాగుపడిపోతుందా "
అనే తలపు కూడా రానివ్వకు
నాడు గాంధీజీ , భగత్ సింగ్ వంటి వారు
నీలాగే ఆలోచిస్తే నేడు దేశానికి స్వాతంత్య్రం వచ్చేదా ?
వారు కలలు కన్న భారత దేశం ఇదేనా ?
ఆలోచించు ..
న్యాయం కోసం పోరాడు..
గుర్తుంచుకో ! నీవు పోరాడిన నాడు విజయం నీది మాత్రమే కాదు
సకల మానవాళిదీ ..
కళ్ళుండీ చూడలేక పోతున్న ఈ లోకానికి చాటి చెప్పు !
" దేశ భవిష్యత్తు నీ మీద ఆధారపడి ఉంది " అని