సలాం సైనికా...
సలాం సైనికా...
1 min
400
దేశ రక్షణే నీ కర్తవ్యంగా
ఎండెరుగక, చలినెరుగక
రాత్రనకా పగలనకా
కంటిలో వెలుగు , గుండెల్లో ధైర్యం నింపుకుని
సరిహద్దున నీవు చేసే సేవ
పసిపాపల నుండి పండు ముసలి వరకు
నీకు జోహార్ అనేలా
దేశ ప్రజల ప్రాణాలకు నీ ప్రాణం పణంగా పెట్టి
కుటుంబం వేరు దేశం వేరు అని కాకుండా
దేశాన్నే కుటుంబంగా భావించి
మీ కోసం నేనున్నానంటూ వెళ్లి
నీ తుది శ్వాస వరకు పోరాడి
గెలిచే నీ విజయం
కేవలం సరిహద్దుది కాదు ...
దేశం నలుమూలలది .
దేశం కోసం నీవు చేసే త్యాగం ...
తీర్చుకోలేని ఋణం..
కోట్లాది ప్రజలలో విజయ గర్వం నింపే
ఓ భారత సైనికుడా !
నీవు దేశం కోసం ప్రాణాలు అర్పించినా
ప్రతీ భారత పౌరుని గుండెల్లో "చిరంజీవివే"