Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

జాబిల్లి జారిపోకే..

జాబిల్లి జారిపోకే..

1 min
337


జాబిల్లి జారిపోకే ఓ జాము రాతిరి జాగారణకే

ఎదగిల్లి ఎరగనట్లే ఎదురే చూడు ఆ ఆదరణకే

వలపంటే కలల పంటేలే కళ్ళకి కనిపించాకనూ

కలిపుంటే మనసులే విడిపోవే కలహించాకనూ

పగలు రేయి ప్రేమకు పట్టాలెందుకులే చూడనే

వగలు వేయి వలదులే నిజమైన ప్రేమ కూడనే

జాబిల్లి జారిపోకే ఓ జాము రాతిరి జాగారణకే

ఎదగిల్లి ఎరగనట్లే ఎదురే చూడు ఆ ఆదరణకే


అగ్గిపూల బాణాలే సిగ్గు దొంతరలు చీల్చు వేళ

ఉగ్గబట్టిన ప్రాణాలే ఎగ్గునొదిలి పులకించే భళ

అగ్గిపూల బాణాలే సిగ్గు దొంతరలు చీల్చు వేళ

ఉగ్గబట్టిన ప్రాణాలే ఎగ్గునొదిలి పులకించే భళ

ప్రేమంటే ఎదలో ఏదో ఎరుగని సౌఖ్యమే కాదా

ఊ అంటే ఊగించే మైకం మన సొంతమైపోదా

ప్రేమంటే ఎదలో ఏదో ఎరుగని సౌఖ్యమే కాదా

ఊ అంటే ఊగించే మైకం మన సొంతమైపోదా

జాబిల్లి జారిపోకే ఓ జాము రాతిరి జాగారణకే

ఎదగిల్లి ఎరగనట్లే ఎదురే చూడు ఆ ఆదరణకే


కురిపించాకా వెన్నెల మరి కోరికలే రగిలించాకా

మరిపించాకా మనసునే ఆ తీరం తరలించాకా

చెప్పలేని సుఖమేదో చేరిపోదా మదినే నిండుగ

విప్పలేని వివరమే విందులై చేసుకోదా పండుగ 


జాబిల్లి జారిపోకే ఓ జాము రాతిరి జాగారణకే

ఎదగిల్లి ఎరగనట్లే ఎదురే చూడు ఆ ఆదరణకే

వలపంటే కలల పంటేలే కళ్ళకి కనిపించాకనూ

కలిపుంటే మనసులే విడిపోవే కలహించాకనూ



Rate this content
Log in

Similar telugu poem from Romance