STORYMIRROR

Dinakar Reddy

Abstract

4  

Dinakar Reddy

Abstract

ధూమపానం - పోయేపానం

ధూమపానం - పోయేపానం

1 min
316

మాంచి కల

అదో అందాల లోకం

హంసతూలికా తల్పం

అందులో హాయిగా విశ్రమించిన అతడు


ఆహా ఏమి నా భాగ్యమని తలచి నిదురించె

అంతలో పొగ కమ్మెను

చుట్టూ పొగ 

అతని చుట్టూ వలయాల్లా పొగ

పొగ లుంగలు చుట్టుకుంటోంది

అచ్చుం అతని పేగులు చుట్టుకున్నట్టే


తల భారంగా అనిపించింది 

అతడు భార్యా బిడ్డల కోసం చూశాడు

అతని చుట్టూ ఉన్న పొగ పీలుస్తూ

వాళ్లెప్పుడో విగత జీవులైనారు


ఒక్క దమ్ము లాగు మావా

సిగరెట్ తాగడం తప్పే కాదు

ఎక్కడినుంచో ఇవే మాటలు

చెవుల్లో గింగుర్లు తిరుగుతున్నాయి


గాలి వస్తూనే ఉంది

అతని ఊపిరితిత్తులకు ఇక పనిచేసే ఓపిక లేదు

అంతే

అతడు పొగలో కలిసిపోయి రూపాన్ని మార్చుకున్నాడు

ప్రాణం పోయిందని తెలీక వెర్రికేకలు వేశాడు


Rate this content
Log in

Similar telugu poem from Abstract