STORYMIRROR

VENKATALAKSHMI N

Romance Fantasy Others

4  

VENKATALAKSHMI N

Romance Fantasy Others

ప్రేమికులు

ప్రేమికులు

1 min
212

సఖీ..!

నులి సిగ్గుతో

దించిన తలతో

పచ్చటి పెళ్ళి పందిట్లో

నా పక్కన వధువుగా

విచ్చేసిణ క్షణం

నా కంటి కెమెరాలో

చేశాను నిక్షిప్తం

పారాణి పాదాలతో

నా ఇంట అడుగిడినపుడు

నా జీవిత భాగస్వామివై

నూరేళ్ళ కలల రాణివై

నను నడిపించు జీవన జ్యోతివై

నా ఆశలకు ఊపిరి పోసి

కష్టాలలో అండగా

బాధలో తోడుగా

విజయంలో వెన్నంటి

నడిపించిన నీకు

ఏమివ్వగలను..?

అందుకే...

నా గుండె గుడిలో

నిర్మించుకున్న నీ రూపానికి

కాసిన్ని నవ్వుల పువ్వులతో

బోలెడు మురిపాల అక్షింతలతో

అభిషేకించి స్మరిస్తున్నా నీ దాసుడిగా


Rate this content
Log in

Similar telugu poem from Romance