వక్రించిన 'సరళ'రేఖ
వక్రించిన 'సరళ'రేఖ
సరళ అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు ఎంఏఫైనల్ చదువు తోంది
అందాలకుందనపుబొమ్మ. తెలివి తేటలు భగవంతుని దయవల్ల వచ్చాయి
అన్ని క్లాస్ లలో ఫస్ట్ క్లాస్ తో పాసయింది
తండ్రి మాధవయ్య పౌరోహిత్యం చేసుకొంటూ ఒక్కగానొక్క కూతురు సరళను పెంచి పెద్ద చేశాడు
ఎంఏ అయిపోగానే ఓకుర్రాడి చేతిలోపెట్టి మూడు ముళ్లు వేయించి బరువు తీర్చుకో వాలనితాపత్రయం ఆయనకు.
ఐ ఏ ఎస్ పరీక్ష లు వ్రాయమని అధ్యాపకులు ప్రోత్సహించారు సరళను
ఫైనల్ పరీక్షలు జరగడానికి ముందు కల్చరల్ ఫెస్టివల్ లో సరళ శకుంతలా పరిణయము లో శకుంతల వేషం వేసింది
తెలుగు లెక్చరర్ బ్రహ్మానందం డైరెక్షన్ లో నాటిక ప్రదర్శన జరిగింది
దుష్యంతుడు గా సుకుమార్ నటించాడు
అతడు యస్సీ స్కాలర్షిప్ తో హాస్టల్లో ఉంటూ ఎకనామిక్స్ ఎంఏ చేస్తున్నాడు
అతని చురుకుదనం, మాటతీరు సరళను ఆకర్షించాయి. వారంరోజుల రిహార్సల్స్ లో శకుంతల దుష్యంతునికి సన్నిహిత మైంది
రిజల్ట్స్ వచ్చాయి. ఇద్దరు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు
సుకుమార్ ఐఎఎస్ కోచింగ్ సెంటర్ లో హైదరాబాద్ లో చేరి సరళనుకూడా చేరమన్నాడు
మాథవయ్య తలతాకట్టు పెట్టి అయినా చదివి స్తానన్నాడు
మేనమామ ఇంట్లో వుంటూ చదువుకొనే ఏర్పాటు చేశ
ారు
హైదరాబాద్ లో చేరి సరళ అశోక్ నగర్ కోచింగ్ కెళ్ళి వస్తోంది
అదే సెంటర్ లో సుకుమార్ స్కాలర్షిప్ సంపాదించి ఎన్ టి ఆర్ విద్యతోనే చివరిలో భాగమయ్యాడు
క్లాసులో ఇద్దరూ జంటగా కూచొని ఆఏడు ప్రిలిమ్స్ చేశా రు
రెండో ఏడు సరళ మెయిన్స్ పరీక్ష పాస్ అయింది
సుకుమార్ నెగ్గలేదు. ఊరి కెళ్ళి పోతానన్నాడు
సరళ భోరున ఏడ్చింది. నేనూ నీతో కలిసి సంతోషంగా బ్రతికేస్తానంది
ఓసాయంకాలం ఇద్దరు రైలు ఎక్కి అన్నవరంలో పెళ్లి చేసుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు
ఆరాత్రి విశాఖపట్నం చేరి హోటల్ లో రూం బుక్ చేసుకుని మూడు రాత్రులు హాయిగా ముగించారు
ఇద్దరి దగ్గరా డబ్బు లు లేవు
మర్నాడు రైలు స్టేషన్ కొచ్చారు. టికెట్లు తెస్తానని వెళ్లిన సుకుమార్ రాత్రి పదింటికి కూడా రాలేదు
ఇంకా అతడు రాడనే నిశ్చయానికి వచ్చింది
తాను మరో శకుంతల అయింది
విశాఖపట్నం ఆర్ కె బీచ్ కెళ్ళి చనిపోవాలని ప్రయత్నం చేసి పోలీసు విజిల్ విని మళ్లీ రైలు స్టేషన్ కొచ్చింది. చేతిలో బ్యాగ్ అక్కడే ం
పడేసింది.
రైలు కింద పడాలను కొంది
అంతా అగమ్యగోచరంగా వుంది
ఢిల్లీ వెళ్ళే రైలు వచ్చి ఆగింది.జనరల్ కంపార్ట్మెంట్ లో ఎక్కి కూచొంది.