kondapalli uday Kiran

Abstract Classics Inspirational

4  

kondapalli uday Kiran

Abstract Classics Inspirational

విశ్వాసం

విశ్వాసం

1 min
401



బొల్లారం అనే గ్రామంలో లో 

నవ్య ,లలిత, ఇంకా వారి పెంపుడు కుక్క ఉండేది .

దాని పేరే టామీ. టామీ నీ బాగా చూసుకునే వారు కాదు , సరిగ్గా అన్నం పెట్టే వారు కాదు,ఎప్పుడు

కొడుతూనే ఉంటారు, కానీ టామీ మాత్రం ప్రతిరోజు నీళ్లు తాగుతూ ,ఏడుస్తూ,

అమాయకపు ముఖంతో ఒక మూలన పడుండేది. ఆఖరికి టామీ ని ఇంట్లో నుండి బయటకు పంపించేశారు. ఒకరోజు నవ్య ,లలిత , కంపెనీ నుండి ఇంటికి వస్తున్నారు అర్ధరాత్రి పది గంటలు అయింది, వాళ్లను 

కొంతమంది అబ్బాయిలు ఏడిపిస్తున్నారు. అప్పుడే అక్కడికి టామీ వచ్చింది. నవ్య టామీ... టామీ... అని గట్టిగా అరిచింది. టామీ మాత్రం ఏమి మనసులో పెట్టుకోకుండా టామీ వాళ్ళ స్నేహితులను కూడా తీసుకొని వచ్చి వాళ్లతో పోట్లాడి ఆఖరికి కాపాడింది. దాంతో నవ్య, లలితల, తప్పు తెలుసుకొని టామీ నీ ఇంటికి తీసుకొచ్చి బాగా చూసుకున్నారు. టామీ బాధపడుతూ వాళ్ళ స్నేహితులకు ధన్యవాదాలు చెప్పింది.


అందుకనే మూగజీవులను ప్రేమిద్దాం,

అవి కూడా మనల్ని తిరిగి ప్రేమిస్తాయి.


Rate this content
Log in

Similar telugu story from Abstract