వేదం సినిమాలో..
వేదం సినిమాలో..
కేబుల్ రాజు డబ్బులు తిరిగిచ్చేసిన తరువాత సీన్..
పద్మా! మామ డబ్బులు దొరికాయి. నీ కొడుకు చదువుకుంటాడే అని అంటాడు. పద్మ లోపల నిజమా అని అడుగుతూ ఉంటుంది.
కేబుల్ రాజు వాళ్ళ మాటలు వింటూ సంతోషపడి కన్నీళ్లు కారుస్తాడు.
అప్పుడే అతని భుజం మీద ఒక చెయ్యి పడుతుంది.
అది గణపతి చెయ్యి. అతణ్ణి చూడగానే కేబుల్ రాజు గట్టిగా ఏడుస్తాడు.
తప్పులు అందరూ చేస్తారు. కానీ నువ్వు రియలైజ్ అయ్యి వెంటనే వాళ్ళ డబ్బులు వాళ్లకిచ్చి గొప్ప పని చేశావ్.
ఒకటి కాదు. ముగ్గురి భవిష్యత్తును కాపాడావు అంటాడు.
అంతలో సరోజ కర్పూరాన్ని తీసుకుని అటు వైపే వస్తుంది.
