Dinakar Reddy

Abstract Comedy Drama

4  

Dinakar Reddy

Abstract Comedy Drama

ఉచిత సలహాలు

ఉచిత సలహాలు

2 mins
651


ఆ కుర్చీ తీసి వరండాలో వేసుకో. ఎంత చల్లటి గాలి వస్తోందో అని చెప్పి లోపలికి వెళ్ళాడు సన్యాసిరావు.

వాళ్ళావిడ వనజమ్మ కుర్చీలో తీరిగ్గా కూర్చుని పాత పాటలు వింటోంది. సరేలే అని కుర్చీ తీసుకుని వచ్చి వరండాలో కూర్చుంది.


వెంటనే దోమల మందు చల్లే మున్సిపాలిటీ వ్యాను వచ్చి వీధిలోనే కాకుండా వరండా అంతా స్ప్రే చేసి వెళ్లారు. వారి వేగవంతమైన పనిలో ఆ మందు కాస్త వనజమ్మ మీద కూడా పడింది.


ఆ సాయంత్రం సన్యాసిరావుకి చీవాట్లు తప్పలేదు. ఎందుకండీ మీ ఉచిత సలహాలు అని.


ఈ మాత్రం దానికేనా అని మీరు మెటికలు విరవకండి. ఇంకొన్ని ఉదాహరణలు వింటే మీకు బాగా అర్థమవుతుంది.


సన్యాసిరావు స్వతహాగా మంచి వ్యక్తే. కష్టపడి పైకొచ్చిన రకం. కాకపోతే ఈ ఉచిత సలహాలు ఇచ్చే అలవాటే అతడిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది.


వనజమ్మ చెప్పి చెప్పి ఇక ఆ విషయమే వదిలేసింది. 


ఓ రోజు ఆఫీసులో సన్యాసిరావేదో బాస్ ముందు ఉపన్యాసం ఇస్తున్నాడు. ఇంతలో పక్క గదిలోని శంకరం అనే అతను పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళడానికి లేచాడు. 


బాస్ రూం దాటుకుని వెళుతుండగా సన్యాసిరావు పిలిచాడు. ఖర్మ. ఈ గ్లాసు తలుపులతో ఇదే చిక్కు అనుకుంటూ శంకరం లోపలికి వెళ్ళాడు. 


ఒక గంట సేపు సన్యాసిరావు వాళ్ళ బాసుకి పొద్దున్నే టిఫిన్ నుంచీ రాత్రి వరకూ ఏమేం ఆహారం తీసుకుంటే లావు తగ్గుతామో చెబుతూ ఉన్నాడు. అది కాదు. ఇది కాదు అని శంకరం తన పరిస్థితి చెప్పాలి అని ప్రయత్నించినా మన సన్యాసిరావు కి వినిపించుకుంటేనా.


బాస్ కూడా మొహమాటం కొద్దీ వింటున్నాడు. అసలు సాయంత్రం ఆరింటికల్లా భోజనం చేసేయాలండీ అని అన్నాడు సన్యాసిరావు. శంకరం గోడ గడియారం వైపు చూశాడు. రాత్రి ఏడు దాటింది.


సార్! మమ్మల్ని తొందరగా వెళ్లనిస్తే కదా ఆరింటికి తినేది అని శంకరం అరిచి బయటికి వెళ్ళిపోయాడు.


బాస్ ముఖంలో చెప్పలేని అసహనం. సన్యాసిరావు కి అక్షింతలు పడ్డాయి. 


వనజమ్మకు విషయం చెప్పాడు ఆ రాత్రి. భర్తకు ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. చెప్పేది మంచి విషయమే. కానీ బాస్ ఆ విషయాన్ని అడగలేదు. శంకరం పరిస్థితి తెలుసుకోకుండా ఇంటికి అర్జంటుగా వెళ్లాల్సిన వాడిని అలా కూర్చోబెడితే కోపం రాదూ అని సముదాయించింది. ఎవరైనా మనల్ని సలహా అడిగితే మనకు ఆ విషయం మీద కాస్త పరిజ్ఞానం ఉంటేనే సలహా ఇవ్వండి అని ఇప్పటికే వంద సార్లు చెప్పి చూసింది వనజమ్మ.


ఆ మరుసటి రోజు పొద్దున్నే పక్కింటాయనకి ఉదయం లేవగానే ఏమేం వ్యాయామాలు చేయాలో ఉచితంగా చెప్పేస్తున్నాడు సన్యాసిరావు. 


ఆ పక్కింటాయన మొహంలో ఏదో చెప్పలేని ఆవేదన. చిరాకు మొత్తం ఆ ముఖంలో తాండవం చేస్తోంది. 


ఏవండీ! అని భర్తను వనజమ్మ పిలవగానే ఇదే అవకాశం అని పక్కింటతను ఇంట్లోకి పరుగెత్తాడు. 


సన్యాసిరావు మళ్లీ అతని కోసం వెతకడం చూసి వనజమ్మ అయ్యో రాత అని తల పట్టుకుంది.


Rate this content
Log in

Similar telugu story from Abstract