STORYMIRROR

Dinakar Reddy

Abstract Comedy Drama

4  

Dinakar Reddy

Abstract Comedy Drama

టీవీ ఫ్రెండ్స్

టీవీ ఫ్రెండ్స్

1 min
576

సునీతా! ఈ మధ్య మార్కెట్ కి రావట్లేదు అంది శైలజ సునీతను చూస్తూనే.

ఇద్దరూ బెండకాయలు లేతగా ఉన్నాయా లేదా అని విరుస్తూ చెక్ చేసుకుంటున్నారు.ఈ మధ్య మా శ్రీవారు వాళ్ళ ఆఫీసు దగ్గర ఉన్న మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చేస్తున్నారు. అందుకే రావట్లేదు అంది సునీత.


శ్రీవారు అంటే గుర్తొచ్చింది. నువ్వు గానీ ఆ " శ్రీవారి కౌగిట్లో ప్రియురాలు" అనే కొత్త సీరియల్ చూస్తున్నావా అంది. 


లేదు వదినా. ఈ మధ్య నేను తెలుగు సీరియల్స్ చూడట్లేదు అంది సునీత కీర కాయలు బేరమాడుతూ.


మరి ఇంకేం చూస్తున్నావ్. కొంప తీసి ఆ హిందీ డబ్బింగ్ సీరియళ్ళు చూస్తున్నావా? అంది శైలజ.


ఇద్దరూ కూరగాయలు కొని ఆకుకూరల వైపు వెళ్ళారు.

"ఎదురింటి ప్రియురాలికి మాజీ భర్త" అనే సీరియల్ కొద్ది రోజులు చూశాను వదినా. మన వాళ్లకు క్రియేటివిటీ లేకుండా పోతోంది. అందుకే నేనీ మధ్య ఫ్రెంచ్ సీరియల్స్ చూస్తున్నాను. సూపర్ గా ఉన్నాయి అంది సునీత.


అందులో అత్తా కోడళ్ళు ఉంటారా అంది శైలజ మూతి తిప్పుతూ.


అత్తా కోడళ్ళు ఒక్కటేనా ఎప్పుడూ. ఇంకా ఎన్ని విషయాలున్నాయో తెలుసా అంది సునీత.


చాల్లే బడాయి. సీరియల్ అన్నాక అత్తా, కోడలూ, ఒక చదువుకున్న మూర్ఖురాలైన శాడిస్ట్ విలన్, వీళ్లంతా ఉండాలి. అదీ సీరియల్ అంటే అంది శైలజ.


వదినా. రేపు ఆదివారం మా ఇంటికి రా. నీకు ప్రపంచంలోని సీరియల్స్ అన్నీ explain చేస్తాను. తరువాత నీ ఇష్టం అంది సునీత.


సరేలే అంది శైలజ. 


(ఆ విధంగా టీవీ ఎన్నో విషయాల్ని ఎందరికో పరిచయం చేసింది. గమనిక: పాఠకులు వారి వారి ధైర్యాన్ని బట్టి సీరియల్స్ చూస్తారని ఆశిస్తున్నాం)


Rate this content
Log in

Similar telugu story from Abstract