తేనెమనసు
తేనెమనసు


‘రాఘవా! ఇండియాకు జనవరి సెలవులకు వస్తావా?-‘ఆశగా అడిగింది జానకమ్మ
నీ ఆరోగ్యం జాగ్రత్త -కొడుకు శివ మాట మారుస్తూ అన్నాడు
‘మనవడు పుట్టి మూడు ఏళ్లు అయిందిరా! వాడినిచూచి చనిపోతానురా’
‘నీ చేతిగోరుముద్దలు నా లాగా వాడూతింటాడు లే’
మీరు రారు-నేను రాలేనుగదా
నాన్న, నువ్వు ఐదేళ్ళుగా అదే మాట అంటున్నారు’
కోడలిచేత మాటాడించరా’
———-/////——
రాఘవా! అమ్మను ICU లో పెట్టారు రా’ అం టూభోరుమని ఏడ్చాడు శంకరం
ఏమైంది నాన్నా!
సడన్ హార్ట్ ఎటాక్ చిన్నా! చిన్నా అని కలవరింతలు’
రేపే నేను, కమల, చిన్నా బయలుదేరుతాం’
———-“”””———
ఐ సి యూ లోకి చిన్నాతోఅడుగు పెట్టిన రాఘవ భోరుమన్నాడు
ఇక్కడ ఏడవద్దు - అంది లేడీ డాక్టర్
అమ్మాఅంటూ ఏడ్చాడు
కళ్ళు తెరిచిన జానకమ్మ మనవడని గుండెలకు హత్తుక ఏడ్చిలేచి కూచుంది