RA Padmanabharao

Tragedy

4  

RA Padmanabharao

Tragedy

సూర్యచంద్రులు

సూర్యచంద్రులు

1 min
357


IIT ఢిల్లీ కాన్వొకేషన్ ఘనంగా జరుగుతోంది గోల్డ్ మెడల్ తీసుకోవటానికి వినయచంద్ర స్టేజిపైకి వెళ్ళాడు

చప్పట్లు మారుమోగాయి

మరో మెడల్ తీసుకోవడానికి సూర్యతేజను పిలిచారు

రూమ్ మేట్లు ఇద్దరే అన్ని మెడల్స్ తీసుకొంటే ఎలారా’ అన్నాడు ఓ కుర్రాడు

ఇద్దరూ ఒకే రూంలో నాలుగేళ్ళు వుండి చమ్మీలయ్యారు

సూర్యచంద్రులని పేరు తెచ్చుకున్నారు

ఒకరు సిమ్లానుండి మరొకరు హైదరాబాదునుండి ఢిల్లీ వెళ్ళి చదువుకున్నారు

20 ఏళ్ళు గడిచాయి

ఇద్దరూ హైదరాబాదులో సాఫ్టువేర్ దిగ్గజాలని పేరు తెచ్చుకొన్నారు

సంసారాలు , ఉద్యోగుల గొడవల్లో తలమునకలయ్యారు

సూర్యుడి భార్య నెమ్మదస్తురాలు

పురాణాలలో చెప్పినట్లు ఛాయాదేవి

భర్త ననుసరించడమే తప్ప తాను స్వయంగా బయటి కెళ్ళలేదు

చంద్ర భార్య లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు. నోరు పారేసుకొంటుందని లోకంలో పేరు

నిజంగా ఆమె సూర్యుడు భార్య రోహిణిలా రోజూ పెటపెటలాడు తుంటుంది

ఆఫీస్ కెళ్ళి తానే బాస్ లా ఆర్డర్ లు వేసి గడగడలాడించేది

మిత్రు లిద్దరూ సాక్షిగా చూస్తుంటారు

మహిళాభ్యుదయం అని మందు పార్టీలలో నవ్వుకొంటారు

సూర్య కంపెనీ లాభలబాటలో సాగిపోతోంది

ఓ రాత్రి పార్టీ లో సూర్య తన కంపెనీ అమ్మకానికి పెడతానని చంద్రంతో అన్నాడు

పోరా ఇడియట్! నేనే కొంటాను నిన్ను, నీకంపెనీను - అన్నాడు సూర్య కిక్కు ఎక్కి

దివాలా తీసే నీ కంపెనీ పడవను ఒడ్డుకుచేర్చరా- మొగాడివైతే - అన్నాడు సూర్య

ఫారన్ కంపెనీ వాళ్ళతో నెగోశియేషన్ పూర్తి చేశాడు సూర్య

ఓ రాత్రి సూర్య చంద్రులు గొడవ పడి విడిపోయారు

..।।।।...

సూర్య ఆసాయంకాలం బోర్డు మీటింగులో కంపెనీ చేతులు మారే ప్రక్రియకు ఆమోదం పొందాడు

45 ఏళ్ళకే హాయిగా రిటైరయి కాలం గడపాలని నిశ్చయించుకొన్నాడు

తన క్యాబిన్లో కెళ్ళి రిలాక్సయ్యాడు

షార్ట్ సర్క్యూట్ అయి క్యాబిన్ లో పొగలు నిండాయి

డోర్ వైపు పరుగెత్తాడు

లాక్ అయిపోయింది

తన కంపెనీ మొత్తం తన కళ్ళ ముందే భస్మీపటల మైంది

’చూసుకో ! కుక్క చావు చస్తావని నిన్ననే బెదిరించిన చంద్రం కళ్ళముందు మెదిలాడు

సూర్యాస్తమయవేళ సూర్యుడు అస్తమించాడుRate this content
Log in

Similar telugu story from Tragedy