STORYMIRROR

kottapalli udayababu

Drama Romance Action

4  

kottapalli udayababu

Drama Romance Action

"సంయుక్త సంఖ్య"

"సంయుక్త సంఖ్య"

7 mins
311

‘ సంయుక్త ‘ సంఖ్య 

వేడి వేడిగా టిఫిన్ తయారు చేసేసి అన్ని హాట్ బాక్స్ లో డైనింగ్ టేబుల్ మీద సర్దేసి బెడ్రూమ్ లోకి వచ్చిన సంయుక్త చడీ చప్పుడు లేకుండా విశాలమైన జైంట్ కాట్ మీద వాలుగా పడుకుని ఒక చెయ్యి తల కింద పెట్టుకుని బాత్రూం తలుపు కేసి చూస్తూ ఉండిపోయింది .లోపల నీళ్ళ చప్పుడు వినిపిస్తోంది.


సుదీర్ఘంగా నిట్టూర్చిన ఆమె ఒక్కసారిగా బోర్లా తిరిగింది . అప్పటివరకు ఆమె వక్షద్వయం మధ్య ఇరుక్కుపోయిన బంగారు మంగళసూత్రాలు బ్రతుకు జీవుడా అనుకుంటూ ఒక్కసారిగా ఆమె మెడలోంచి వేలాడుతూ చిన్నగా ఊగుతూ గాలిపోసుకుంటున్నాయి . తానూ కోరుకున్న కోరిక తీరడంతో భక్తుడు కొట్టిన పెద్దసైజు కొబ్బరికాయ సరిగ్గా సమానంగా పగలగా ఏర్పడిన రెండు అర్ధభాగాలను చూసి అతనిలో పెల్లుబికిన ఆనందపు పొంగులాంటి భావనను ప్రతిబింబిస్తున్న ఆమె వక్ష సంపద వెచ్చదనాన్ని ఆమె వాలిన దిండు అనుభవిస్తూ, ఆమె కదలికలకు అనుగుణంగా స్పందిచసాగింది.


పున్నమిరాత్రి జంట త్రాచులు ఒకదానొకటి పెనవేసుకుని తమకంతో ఊగుతున్నట్టుగా వూగుతున్న ఆమె బంగారు రంగు కాళ్ళమీద నున్న నైటీ నెమ్మదిగా మోకాళ్ళవరకు స్థానభ్రంశము చెంది తనకు మోక్షప్రాప్తి ఎపుడా అని ఎదురు చూస్తున్నట్టుంది.


బాత్రూం లో నీళ్ళ చప్పుడు ఆగిపోయింది.’’పిల్లా నీవు లేని జీవితం...నల్లరంగు అంటుకున్న తెల్లకాగితం’’ వినబడుతున్న ప్రణవ్ హమ్మింగ్ విని శబ్దం పైకి రాకుండా నవ్వుకుంది సంయుక్త .ఎంతబాగుంది కంఠం? శృతిలోనే హమ్ చేస్తున్నాడు? అనుకుంది. బాత్ రూమ్ తలుపు ఓపెన్ అయింది.ఎలా వస్తున్నాడో బయటికి అనుకుని రెండు కళ్ళను దోసిలితో మూసుకుని నెమ్మదిగా చూపుడువేలు, మధ్యవేలుల మధ్య ఖాళీని పెంచుతూ చూడసాగింది.


ఒంటికి టవల్ చుట్టుకుని, స్నానం చేసిన తలను కప్పేసిన కాటన్ టవల్తో తలతుడుచుకుంటున్న అతను సంయుక్త గదిలో ఉన్నట్టు చూడలేదు. పాట హమ్ చేసుకుంటూ అతని ధోరణిలో అతనున్నాడు.అలాగే తల తుడుచుకుంటూ ఫాన్ స్పీడు పెంచి, అలవాటుగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దం దగ్గరకు వచ్చి తుడుచుకుంటున్న టవల్ తీసి మంచం మీదకు విసిరేసాడు. అనంతరం ఒంటికున్న టవల్ తీసేసి కుడి చేతిని ఎడం చేత్తో తుడుచుకోబో....తూ అద్దంలో.... చూస్తె...


‘’రోజూ బర్త్ డే డ్రెస్ ఇలానే వేసుకుంటావా? బాబూ ’’ పకపకా నవ్వుతూ అడుగుతున్న సంయుక్తని చూస్తూనే తానేస్థితితిలో ఉన్నాడో కూడా చూసుకోకుండా ‘’అమ్మదొంగా.ఇక్కడేం చేస్తున్నావ్ నిశ్సబ్దంగా?’’ఒక్కసారిగా ఆమెపై వాలిపోయాడు.


‘’ నేను స్నానం చెయ్యలేదు ప్రణూ.నన్ను ముట్టుకోకు.ప్లీ.......జ్’’ అనబోతున్న ఆమె దొండ పెదవులను ఆతని పింక్ పెదవులు మరి మాట్లాడనివ్వలేదు. మరేమీ చేయలేని నిస్సహాయతలో ఆమె, బాగా పండిన బంగినపల్లి మామిడి పండురంగులో మెరిసిపోతున్న అతని విశాలమైన వీపు చుట్టూ తన తామరతూడుల చేతుల్ని బిగించి విశాలమైన తన కనురెప్పల్ని అర్ధనిమీలితం గా మూసుకుంటూ అతనికి సహకరించసాగింది.


ఇక ప్రణవ్ ... పెదాల గట్లమీదనుంచి నోటి కొలనులోకి దూకి అప్పటికే అక్కడ సిద్దంగా ఉన్న మరో ఫ్రెష్ చికెన్ ముక్కను తన నాలుక తోళ్ళికతో లోపలికి స్పృశిస్తూ ఎన్నిరకాల రుచుల స్తావరాలున్నాయో అన్నిటిని నెమ్మదినెమ్మదిగా ఆస్వాదిస్తూ మళ్ళీ పెదవుల గట్లమీదకు వచ్చి అక్కడి మడతలలో దాక్కున్న జుంటే తేనెలు తాగుతూఉండగానే అతని చేతులు నెమ్మదిగా ఆమె యవ్వన గిరులపై వాలాయి.


ఒక్క నిముషం అలసట తీర్చుకోవడం కోసం ఆమె మెడవంపులో తలదాచుకున్న ప్రణవ్ ని అడిగింది సంయుక్త.


‘’ఏమిటి పూతనమీద బాల శ్రీకృష్ణుడిలా ఈ దాడి? ఆఫీస్ లేదా?’’


అతడు ఆమె మీదనుంచి పక్కకి ఒరిగి ఒక చేయి తలకింద పెట్టుకుని ‘’ ఛ.అదేం పోలిక ?నా ఆఫీస్..నా ఇష్టం.’’ అంటూ ఆమె పైకి విసిరిన టవల్ ను తన నడుము మీదకు లాక్కున్నాడు.


‘’నా పేలండ్రోంస్ మీద చేతులు వేసిన వాడినడుగుతున్నాను.’’ అందామె రక్తం చిమ్మడానికి రెడీగా ఉన్నట్టున్న పెదాలను నాలికతో తడుపుకుంటూ.


‘’ మళ్ళీ మధ్యలో సబ్జెక్ట్ ఏంటి? హు..హు...ఇపుడోద్దు సంయూ’’ గారంగునుస్తూ అన్నాడు ప్రణవ్.


‘’మరి ఓడిపోయానని ఒప్పుకో.’’ అందామె చిలిపిగా కళ్ళు ఎగరేసి.


‘’ఓడిపోయాను. ఇంతకీ పేలండ్రోం అంటే ఏమిటి?’’ అడిగాడతను ఉత్సాహంగా.


‘’ ఏమిటా.ఎడమ నుంచి కుడికి , కుడి నుంచి ఎడమకు ఒకే విధమైన అక్షరాల అమరిక లేదా అంకెల అమరికని పేలండ్రోం అంటారు.’’


‘’ అంటే? వీటిలాగానా?’’ ఆమె వక్షం మధ్యలో తలదాచుకుంటూ.ఆమె మత్తుగా అతని తలను తన గుండెలకు మరింతగా నొక్కుకుంది.


అలా ఉండగానే తన కోటేరు ముక్కుతో ముందుకు వెనుకకూ అక్కడ గీస్తూ అడిగాడు.’’ మరి ఈ మధ్యలో గీతను ఏమంటారు?’’


‘’సౌష్టవరేఖ.అంటే క్రమమైన ఆకారం కలిగిన ఎ వస్తువునైనా రెండు సర్వసమాన భాగాలుగా చేసే సరళరేఖ.’’


‘’ నాకు నీ ఈ పేలండ్రోంస్ అంటే చాలా ఇష్టం.’’అన్నాడు అతను ఆమె వక్షపు రెండు శిఖరాలమీద సున్నితంగా చుంబిస్తూ.


‘’ మరి నేను చెప్పనా?’’ అందామె చిలిపిగా.


‘’వూ..చెప్పు’’ ప్రోత్సహించాడతను.


ఆమె అతని చేవిలోచేప్పి నిగ్గుతో అతన్ని ఒకటిలా నిలువునా అల్లుకుపోయింది.


అతను ఆమె ఒక చేయి తీసి తన నడుము వెనుక కిందభాగంలో ఒక వైపు వేసుకుని ఆమె తీసేస్తుందేమో అని గట్టిగా పట్టుకుని


‘’ఇవి కదా ‘’ అన్నాడు.


సంయుక్త పకపకా నవ్వేసి అతనిలోకి మరింతగా దూరిపోయి అతని గెడ్డం కింద తన ముఖాన్ని దాచేసుకుంది.


‘’చెప్పడానికి లేని సిగ్గు...చెయి వేస్తె వచ్చిందా...అయినా మరీ ఇంత సిగ్గులేనిదానిలా తయారయ్యవేంటి?’’ ఆమె ముక్కు పట్టి అడిగాడు ప్రణవ్.


‘’ ఆ ప్రశ్న నన్ను కాదు అడగాల్సింది. నిన్ను నువ్ చూసుకో ఎలా ఉన్నవో. అయినా మొదటి రాత్రి నువ్వు నాదగ్గరగా వచ్చి నన్ను నీ కౌగిలిలోకి తీసుకుని నా చెవిలో గుసగుసగా ఏం చెప్పావో గుర్తు లేదా...?’’


‘’ ఏం చెప్పాను?” అతనూ ఈసారి ఆమె చెవిలో అంతే గుసగుసగా అన్నాడు.


‘’భార్యా భర్తల దాంపత్యం అనురాగామయం కావాలంటే అరమరికలులేని దాంపత్య జీవితం గడపాలి.ఆసమయంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా పరస్పర సహకారంతో ఒక్కొక్క అవరోధం తొలగించుకుంటూ పైమెట్టుకు చేరాలి. అపుడే రససిద్ధి కలుగుతుంది. అలా రససిద్ధి కలిగిన దాంపత్యం కలకాలం అదే స్థాయిలో ఆనందంగా ఉంటుంది.ప్రతీరాత్రి వసంత రాత్రి అవుతుంది.ఒక రాణివాసపు అంతఃపురంలో ప్రవేశించాలంటే మగవాడు ఏడూ కోటలు దాటాలి.’’ అంటూ ఒక్కొక్క కోట దాటుకుంటూ నన్ను సిగ్గు లేనిదానిగా చేసింది నువ్వు.అర్ధమైందా అబ్బాయిగారికి.’’ అంది అతని కోటేరు ముక్కును సున్నితంగా కొరుకుతూ.


‘’ఇంతసేపు టైం వేస్ట్ చేసావని అర్ధమైంది.’’అంటూ ఆమెను ఆక్రమిం చుకోబోయాడతను.


‘’నేను స్నానం చెయ్యలేదు గురూ.’’అంటూ లేవబోయింది.


అతను ఆమెను తన కింద నొక్కి పెట్టి ‘’కొన్ని కొన్ని సందర్భాలలో వెజ్ భోజనం లో నాన్-వెజ్ కర్రీ వాసనలా ఆ సువాసనలు చాలా బాగుంటాయి. ఇంకా మాట్లాడితే ఒలిచేస్తాను జాగ్రత్త.’’


‘’ఏమిటి?’’ అని అడిగే అవకాశం లేకుండానే ఆమె పైపోరలు ఒలవసాగాడతను.


అరగంటసేపు ఆగదిలో స్నానం చేసిన మన్మధుడు, స్నానం చేయని రతీదేవి తమ తమ అన్యోన్య విన్యాసాలు వారిచేత చేయించి మాయమైపోయారు.


ఇద్దరూ ఫ్రెష్ అయిన వెంటనే ప్రణవ్ తయారై డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు.


వేడివేడిగా వున్నా ఉప్మా-పెసరట్టు వడ్డించింది సంయుక్త.


‘’ పెసరట్టు నేను.ఉప్మా నువ్వు.’’ అన్నాడు పెసరట్టు ముక్కను తుంచి, ఆ ముక్క మధ్యలో ఉప్మాను ఇరికించి నోట్లో పెట్టుకోబోతూ చాకచక్యంగా సంయుక్త నోట్లో పెట్టేసాడు ప్రణవ్.


‘’నువ్వేళ్ళాకా ప్రశాంతంగా నేను తింటాను ప్రణూ.ఇప్పటికే లేటైంది ‘’ అంది సంయుక్త నములుతూ.


ప్రణవ్ కూడా ఒక ముక్క అలాగే తిని ‘’వావ్. ఫాంటాస్టిక్. మనకు బాబో, పాపో పుట్టే లోపల నీకన్న ముందు నాకే వచ్చెసేటట్టుంది.’’అన్నాడు పొట్టను ఎత్తుగా చూపిస్తూ.


‘’అయితే వాళ్ళని నువ్వే కనేసేయ్.’’ కిలకిలా నవ్వింది సంయుక్త.


టిఫిన్ చేసేసి ఆఫీస్ కు బయల్దేరుతూ ‘’నా మామూలు ‘’ అడిగాడు ప్రణవ్.


‘’మామూలేంటి? భోజనం చేసి టిఫిన్ చేసేవాడిని నిన్నే చూసాను.ఆఫీస్ కి వెళ్ళిన వెంటనే ఫోన్ చెయ్యి....’’ అని అతన్ని బలవంతంగా కారు ఎక్కించింది సంయుక్త.


‘’అది మానసిక భోజనం. ఇది శారీరక భోజనం.చెప్తా నీ పని . రాత్రి నీపని పంచ పాండవులే.’’ అని నవ్వేసి ఆఫీస్ కి వెళ్ళిపోయాడు ప్రణవ్.


అతను వెళ్ళాకా తానూ టిఫిన్ చేసి అలసిన శరీరాన్ని కాట్ మీదకు చేర్చింది. కాట్ కి పక్కన సొరుగులో ఉన్న తమ పెళ్లి ఆల్బం తెరిచి ఒక్కొక్క ఫోటో పరిశీలనగా చూస్తూ గతంలోకి జారిపోయింది సంయుక్త.


చెట్టుమీదకాయను, సముద్రంలో ఉప్పును కలిపినట్టే మలుపు తిరిగింది జీవితం.


సరిగ్గా తొమ్మిది నెలల క్రితం అమ్మ హటాత్తుగా నలభై అయిదు సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించినప్పుడు తమ్ముడు, తానూ, తండ్రి నిలువునా కోయ్యబారిపోయారు. తెల్లవారు ఝామున మూడు గంటల ప్రాంతంలో మెల్లగా మొదలైన నొప్పి హాస్పిటల్ కి తీసుకువెళ్ళి డాక్టర్ వచ్చేలోపుగానే అమ్మ ప్రాణం పోయింది.


కార్యక్రమాలన్నీ పూర్తీఅయ్యాకా అమ్మజ్ఞాపకాలతో ముగ్గురు క్రుంగిపోతుంటే, తను-తమ్ముడు కోరికపై ఉద్యోగానికి మెడికల్ లీవ్ పెట్టి హైదరాబాద్ పిన్ని, బాబయ్యల ఇంటికి వచ్చారు నాన్న.తను ఎం.ఎస్సీ. మాథ్స్ డిస్టింక్షన్ లో పాసైంది. తమ్ముడు బీ.టెక్. పాసయ్యాడు.తామిద్దరూ ఉద్యోగ ప్రయత్నాలు మొదలెట్టారు.


హైదరాబాద్ వచ్చిన వారానికే తమ్ముడికి ఎం.ఎన్.సి.లో సెలక్షన్ రావడంతో పిన్నికుటుంబానికి భారం కావడం ఇష్టంలేక హాస్టల్లో చేరిపోయాడు.


నాన్నగారు మెడికల్ లీవ్ అయిపోవడంతో నన్ను పిన్ని దగ్గర వదిలేసి వెళ్తూ’’ అమ్మా.ఏడాదిలోగా పెళ్లి చేస్తే ఆ కన్యాదానఫలితం మీఅక్కకు దక్కుతుంది. మీఎరుకలో మంచి సంబంధాలు చూడండి,’’ అని తప్పైనిసరై తన ప్రబుత్వ ఉద్యోగంలో జాయిన్ అయిపోయారు.


పిన్నికి ఇద్దరు మగపిల్లలు. పెద్దవాడు తేజ బెంగుళూర్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. రెండవవాడు భార్గవ కంప్యూటర్ సైన్సెస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.


తన అర్హతలతో కనిపించిన జాబు కల్లా దరఖాస్తు చేయడం మొదలుపెట్టింది. పిన్నికి ఇంట్లో సాయం చేస్తూఉన్నా ఎదో గిల్టీ.


‘’నీకు బోర్ అనిపిస్తే హోం ట్యూషన్ చెప్పవచ్చు కదా అక్కా - టైం పాస్ అవుతుంది.నీకు అనుభవం వస్తుంది.’’ భార్గవ సలహా ఇచ్చాడు.ఒక్క క్షణం అమ్మఆశీర్వదించినట్టు అనిపించింది తనకి.వెంటనే గూగుల్ లో హోం ట్యూషన్స్ అని టైపు చేసింది.కనిపించిన వెబ్సైటు లో లాగిన్ అయి తన వివరాలు పూర్తిచేసింది. అర్బన్-ప్రో వెబ్-సైట్ అది. మూడు రోజుల్లోనే తనకు కాల్ వచ్చింది.


కాల్ వచ్చిన ఇంటికి భార్గవ్ ని తోడూ తీసుకువెళ్ళింది తను.


ఒక అత్యాధునిక ఇండివిడ్యువల్ ఇంటిలో నివసిస్తున్న రెండు కుటుంబాలలో నలుగురు పిల్లలకు చెప్పాలి.


పిల్లలకు మాథ్స్ బేసిక్స్ తెలియదు. అధ్యాయాలు అయిపోయాయి. ‘అదేమిటమ్మా’ అని అడిగితె ‘వెన్ ది టీచర్ సేస్ యు హావే టు ఫాలో ’ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది మేడం ‘’ అన్నారు పిల్లలు.


కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ వృత్తికి న్యాయం చేయాల్సిన న్యాయం చెయ్యని ఉపాద్యాయులు ఆ వృత్తికి అనర్హులు అనుకున్న తనకు ఎదో కసి.


సంఖ్యా శాస్త్రంలో లెక్కింపు సంఖ్యల దగ్గరనుంచి మొదలుపెట్టి, సరి- బేసి సంఖ్యలు, ప్రధాన సంఖ్యా, సంయుక్త సంఖ్య, ట్విన్ ప్రైమ్స్, రెలటివ్ ప్రైమ్స్..మొదలైన అన్నింటిని ఉదాహరణలతో వారికి వివరిస్తుంటే పిల్లలు విస్పారితనేత్రాలతో వింటూ అర్ధంచేసుకుంటూ ఉంటెతనకు ఎంతో ఆనందం అనిపించింది.ప్రతీ నిర్వచనం చదివి నోటికి వచ్చేసిన తరువాత పదిసార్లు చూడకుండా రాయమనేది తానూ.


ఒకరోజు ‘’ఈ హోం వర్క్ కూడా కరెక్ట్ చేసి పెట్టండి మేడం’’ అని ఇంటి ఓనర్ గారి అమ్మాయి ఒక నోట్స్ ఇచ్చింది.


తాను చెప్పిన నిర్వచనాలన్నీ ముత్యాలు పేర్చిన రాతతో అమరిఉన్నాయి.


చివరగా ‘’ మీరు సంయుక్త సంఖ్యా?’’ అని ప్రశ్న చూసి ఖంగు తింది తాను. ఒక సంఖ్యకి మూడు అంతకు మించిన కారణాంకాలు ఉంటే దానిని సంయుక్త సంఖ్య అంటారు. అంటే మీకు పెళ్లి అయిందా...అని అడుగుతున్నారన్నమాట?


తనకు తెలియకుండా తనను ఎవరో గమనిస్తున్నారు.ఎవరో తెలుసుకోవాలన్న ఉత్సుకత తనలో కలిగింది.


‘’నేను ప్రధాన సంఖ్యనూ కాదు, సంయుక్త సంఖ్యనూ కాను.’’ అని తెలుగులో సమాధానం రాసి పంపింది తను. ‘’అంటే? నాకు గణిత మౌలిక భావనలు రావు మేడం.అర్ధమయేలా చెప్పండి.’’


‘’ప్రధాన సంఖ్యా, సంయుక్త నంఖ్య కానిది గణితంలో’ఒకటి’అనే అంకె మాత్రమె. నేను సంఖ్యను కాలేదు.సంఖ్య అంటే రెండు అంకెల కలియిక. ఎవడండి బాబు మీకు చదువు చెప్పేది.?’’ అలా మొదలైంది సందేశాల చాటింగ్.


‘’నేను బాబును కాదు.ప్రణవ్ నాపేరు. మీపేరు?’’


‘’మీరు నేర్చుకుంటున్న సంఖ్యలలో ఒక దాని పేరు.’’


‘’సహజ., పూర్ణ, కరణి, కల్పిత,వాస్తవ...’’


‘’మీకు లెక్కలంటే భయం. అందుకే చెప్పలేకపోతున్నారు.’’


‘’నేను మీఇంటి యజమానురాలి తమ్ముడిని. చార్టెడ్ అకౌంటెంట్ గా చేస్తున్నాను..మీరు నాకు నచ్చారు. మీకు ఇష్టమైతే మీ పెద్దవాళ్ళతో మాట్లాడమంటాను మా అక్కయ్యను.’’


‘’నేను సున్నలాటి దానిని. నన్ను దరిచేర్చుకుని నావిలువ పెంచే ‘1 ‘ ని చూడాలని నాకూ ఉంటుంది.’’


‘’ నన్ను రేపు చూపిస్తాను.’’


మరునాడు విజయ దశమి. ఆరోజు ట్యూషన్ కి సెలవు. ఇంట్లో పిన్నికి అన్ని పనులలోను సాయం చేస్తోంది తానూ. తమ్ముడు భార్గవతో ఎవరో ఫ్రెండ్ వచ్చాడు. భార్గవ పరిచయం చేసాడు అతన్ని. మనిషి చూడటానికి రాజకుమారుడిలా, టీవీ సీరియల్ హీరోలా ఉన్నాడు. అతను వెళ్ళాకా అడిగాడు భార్గవ. అతను ఎలా ఉన్నాడు? అని


‘’నాది కాదు అన్న వస్తువు కేసి నేను కనీసం చూడను కూడా చూడను. నాదీ అనుకున్ననాడు దానిని ప్రాణంగా చూసుకుంటాను.అమ్మలాగ. ఎందుకంటే ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి పొందలేము.’’ అంది తను అమ్మ గుర్తువచ్సిన బాధలో.


‘’అతను నిన్ను పెళ్లి చేసుకుంటాడట.’’ అన్నాడు నవ్వుతూ.


నాకు ప్రణవ్ మనసులో మెదిలాడు. ‘’ నన్ను ఎవరికిచ్చి పెళ్లి చెయ్యాలో మీ అమ్మకు, మానాన్నకు బాగా తెలుసు.స్నేహితుడి ఇంటికివచ్చి కన్నెపిల్ల కనిపించగానే పెళ్లి చేసుకుంటాను అనడం సభ్యత కాదని అతనికి చెప్పు.’’ అంది తానూ కోపంగా.


మధ్యాహ్నం భోజనం అయ్యాకా ఆశ్చర్యంగా తానూ ట్యూషన్ చెబుతున్న ఇంటి యజమానురాలు, వాళ్ళ పిల్లలు ఇద్దరు వచ్చారు. పిన్నిని ఆప్యాయంగా పలకరించి తనకు కొత్తచీర, పూవులు, పళ్ళు గాజులు, బొట్టుపెట్టి ఇచ్చారు.


‘’మాతమ్ముడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టి కూర్చున్నాడు.’’అని కూర్చుని పిన్నితో అన్ని వివరాలు చెప్పింది. ఇంతలో తన స్టూడెంట్ చాటింగ్ బుక్ ఇచ్చింది. ఈవేల్టి సందేశం ఏమిటా అని చూస్తే అది రమేష్ తో వచ్చిన ఫ్రెండ్ ఫోటో. తనే ప్రణవ్.


సరిగ్గా పదిహేనురోజుల్లో తన పెళ్లి ప్రణవ్ తో కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది అనే కంటే అమ్మే నాకు ఈ దారి చూపించి ఆశీర్వదించింది అనుకుంది తానూ.అమ్మకు కన్యాదాన ఫలం దక్కిందన్న సంతృప్తి నాన్నగారికి కలిగింది.


‘’ఏ పూర్వ పుణ్యమో ప్రణూ నువ్వు నాకు దక్కడం. రియల్లీ నా జన్మ ధన్యం.’’ ప్రణవ్ తన చెవులదగ్గరగా విడుస్తున్న దీర్ఘ శ్వాసల ఊహల్లో అనుకుంటున్న సంయుక్త చెవిలో గుసగుసగా వినపడింది.


 ‘’బాగా ఆకలిగా ఉంది.వడ్డించుకోనా?’’ అన్నాడతను ఉద్యుక్తుడౌతూ .


ఎపుడు వచ్చాడో ఏమో...ప్రణవ్!


ఆమె మాటరాని మౌనం ఆగదిలో నృత్యమారంభించింది.


 


                                                               సమాప్తం


 


 


 


 


 


 


 


 


 


 



Rate this content
Log in

Similar telugu story from Drama