STORYMIRROR

Spoorthy Kandivanam

Drama Inspirational Others

4  

Spoorthy Kandivanam

Drama Inspirational Others

సంజీవని

సంజీవని

1 min
354

"మీరిద్దరూ ఇక్కడే కూర్చోండి నేను వెళ్లి టిక్కెట్లు తీసుకొస్తాను. పండగ టైం కదా క్యూ చాలా పెద్దగా ఉంది. అందాక మీకు ఆకలి వేస్తే ఇదిగొండి ఈ టిఫిన్ తినండి. ఆ...మర్చిపోయాను టిఫిన్ తిన్నాక కాఫీ లేకపోతే మీ నాలుకలు నవనవాలాడుతుంటాయని నాకు తెలుసుగా...అందుకే ఈ ఫ్లాస్క్ లో కాఫీ కూడా తీసుకొచ్చాను", తనతోపాటు తీసుకొచ్చిన ఇద్దరు వృద్ధ దంపతులకు మరికొన్ని జాగ్రత్తలు చెప్పి టిక్కెట్ కౌంటర్ వైపు నడిచింది భూమి.


ఇదంతా గమనిస్తున్న ఓ పెద్దాయన, "మీ మనవరాలా...!", అని అడిగారు.


"కాదండీ...కొన్ని నెలల క్రితం వరకు తను మాకు ఏమీ కాదు. మా కన్న బిడ్డలు ఆస్తులు పంచుకుని మమ్మల్ని అనాధలుగా రోడ్డున వదిలేస్తే, ఇప్పుడు మాకు కూతురు, కొడుకు అన్నీ తానే అయ్యి మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. లక్ష్మణుణ్ణి కాపాడడానికి హనుమంతుడు సంజీవనిని తెచ్చినట్లు ఆ భగవంతుడు ఈ భూమిని మా జీవితాల్లోకి సంజీవనిలా పంపి, ఈ రోజు మేము ఇలా ప్రాణాలతో ఉండేలా చేసాడు", ఉద్వేగంతో కన్నీటిపర్యంతమయ్యారు వృద్ధ దంపతులు.


ఇదంతా విన్న పెద్దాయన హతాశుడయ్యాడు.


Rate this content
Log in

Similar telugu story from Drama