స్కూల్లో తెనాలి రామకృష్ణుడు
స్కూల్లో తెనాలి రామకృష్ణుడు


రాయల వారి హైస్కూల్లో చదివే కొంత మంది పిల్లల అల్లరి మరీ కట్టడి చేయలేకుండా ఉంది.
స్కూలుకు వస్తారు. టీచర్లను కామెంట్స్ చేస్తూ క్లాసును ముందుకు సాగనివ్వరు.
ప్రిన్సిపాల్ రాయలు తెలుగు టీచర్ అయిన
రామ కృష్ణను పిలిచి పిల్లల అల్లరిని ఎలాగైనా కట్టడి చేయమని చెప్పాడు.
రామకృష్ణ అల్లరి ఎక్కువ చేసే పిల్లలకు ఒక విషయం చెప్పాడు. వాళ్ళు స్కూలుకు రాకపోయినా అటెండెన్స్ వేస్తాం అని చెప్పగానే ఇదేదో బాగుందే అని అల్లరి పిల్లలు స్కూలుకు రాకుండా మానుకున్నారు. క్లాసులు నిరాటంకంగా జరగసాగాయి.
ఇలా ఒక వారం గడిచింది. కొంత మంది పిల్లలను స్పెషల్ కేర్ తీసుకుని ఇంటి దగ్గరే చదివించమని ప్రిన్సిపాల్ చెప్పినట్టు టీచర్లు అల్లరి మూకల ఇళ్లకే రాసాగారు.
స్కూల్లో అయితే ఒక గంట ఒక క్లాసు చెప్పి కాస్సేపు వదిలేస్తారు. ఇంటికే టీచర్లు రావడంతో రోజంతా క్లాసులు చెప్పేస్తున్నారు. స్కూల్లో అంటే టీచర్ల మీద కామెంట్స్ చేసి క్లాసు డిస్ట్రబ్ చేసే వాళ్ళు కానీ ఇప్పుడు ఇంట్లో అమ్మా వాళ్ళ ముందర బుద్ధిమంతుల లాగా క్లాసులు వినాల్సి వస్తోంది. టీచర్లకు పిల్లల తల్లీ దండ్రుల నుంచి మంచి సహకారం లభిస్తోంది.
నాలుగు రోజులు ఇలా ఇంట్లోనే పాఠాలు వినే సరికి అల్లరి మూకంతా స్కూలుకు పరుగెత్తారు.
మాస్టారూ! ఇక మీదట క్లాసులు ఎప్పూడూ డిస్ట్రబ్ చెయ్యము అని బతిమాలుకొని ఇంటికి టీచర్లను రాకుండా చేయమని వేడుకున్నారు.
రామకృష్ణుడు సరే సరే. ఇక మీదట అయినా బుద్ధిగా చదువుకొమ్మని వారిని క్లాసులకు పంపించాడు.
స్కూలు పేరు చెడిపోకుండా పిల్లల్ని దారిలో పెట్టిన రామ కృష్ణుడి చతురతకు రాయలు అతణ్ణి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.