STORYMIRROR

Dinakar Reddy

Abstract Comedy

4  

Dinakar Reddy

Abstract Comedy

పూరీ అందంగా లేదన్నాడా?

పూరీ అందంగా లేదన్నాడా?

1 min
652

ఎవడివయ్యా నువ్వు. ఎక్కడ చదువుకున్నావ్. పూరీ అందంగా లేదని అంటావా?


ఆ మాటకొస్తే ఆడవాళ్ళు అందరూ లేరంటావా? అన్నీ బాగుంటే ఈ పాటికి మీ ఇద్దరికీ పెళ్లయి ఉండేది. అప్పుడు తెలిసేది నీకు. ఆడాళ్లతో ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదదో అని.


పూరీ బాబాయ్ అందరి ముందూ పార్థుకి చివాట్లు పెట్టాడు. పెళ్ళా. ఎవరికి బాబాయ్ పెళ్లి అంది పూరీ వాళ్ళ అక్క.


ఇదిగో మన పూరీకి పార్థూకి పెళ్లి చేస్తే సరిపోతుంది. అప్పుడు పూరీ అందంగా లేదని చెప్తాడేమో చూద్దాం అన్నారు ఆడవాళ్ళంతా కలిసి.


ఇంత చిన్న నేరానికి ఎంత శిక్ష పడుతోంది అన్నాడు పూరీ వాళ్ళ బాబాయ్. ఆ.. అన్నారు ఆడవాళ్ళంతా.


అబ్బే. అదేం లేదు. పార్థూకి ఇష్టం ఉందో లేదో అని అని నసిగాడు.


పూరీ ఎందుకు నచ్చుతుంది. రోజూ మీరు చపాతీ పెడుతుంటే అంది పూరీ. ఎవ్వరికీ అర్థం కాలేదు. పార్థు నవ్వాడు.


Rate this content
Log in

Similar telugu story from Abstract