Mounika Myadhari

Romance Classics

3.7  

Mounika Myadhari

Romance Classics

పరిచయం

పరిచయం

3 mins
436


సిరి నేను హాలిడే కి అరకు వెళ్ళాలి అనుకుంటున్నానే నువ్వు వొస్తావా. 

అమ్మ ని అడిగి చెప్తానే సరయు... సరే నీకు ఇంట్రెస్ట్ ఉంటే తొందరగా చెప్పవే సాగర్ ని నీకు టికెట్ బుక్ చేయమని చెప్తాను.. హోం మేడమ్ గారు కౌపీలే గ వెళ్తున్నారు అనమాట...మళ్ళి మధ్యలో నేను ఎందుకె బాబు..

 నీకు కొంచం రిఫ్రెష్ గ ఉంటుంది ,నాకు ఒకరు తోడు వున్నట్టు ఉంటుంది అని, సరే అమ్మ కి చెప్పి వొస్తా లే... చల్లని గాలి తన మునుగురులను తాకుతూ ఉంటే..చిన్న చిన్న చినుకులు గాలి లో తన మోము ని స్పర్శిస్తూ.. ఆ రాతిరి తనకి మధురానుభూతిగా మిగిలిపోయేలా ఆహ్వానం పలుకుతూ పక్కనే ఉన్న చెట్టు గాలికి సిరి వైపు గ పువ్వులను విసిరింది..నవ్వుతు చెట్టు వైపు తిరిగి గాలిలో ముద్దులు పెట్టింది..

ఏ ఏంటే తల్లి మళ్ళి నీకు ఈ ప్రకృతి స్వాగతం చెబుతుంది అన్నట్టు ఫీల్ అవుతున్నావా, చాలు కానీ పద లోపలి వర్షం ఎక్కువ వొస్తే తడిసిపోతావు...ఏంటో వెళ్ళక వెళ్ళక హాలిడే కి వెళదాం అంటే వర్షం తగులుకుంది.. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే.. 

ఇదిగో తీస్కో ర నా బాగ్ కరెక్ట్ పెట్టు డ్రెస్సెస్ నలిగితే ఊరుకోను ముందే చెబుతున్న.. అబ్బా వొచ్చాడండి విడు వెళ్ళేది ఆఫీస్ కి విడి బట్టలు నలగ కూడదు, చూస్కోకుండా బాగ్ శిరి వైపు విసిరేసాడు ...చందు !!! ఏంటి సరయు ఏమైంధీ అక్కడ చూసి వెయ్యాలి కదా బాగ్...ఏమైందే ఎవరున్నారు అని అటు వైపు గ చూసి షాక్ అయ్యాడు చందు..

సారీ సిరి గారు చుస్కోలేదండి...నేను చందు సాగర్ ఫ్రెండ్ ని ...పర్వాలేదు లెండి...హాయ్ అని కిటికీ వైపు తిరిగింది..ఎందుకో మొదటి గుండె వేగంగా కొట్టుకుంటున్నట్టు వుంది ..ఎం జరుగుతుంది సిరి ఏంటిది..తనని మొదటి సారి కదా నేను కలవడం కానీ ఈ వింత అలజడి ఏంటి నాలొ..

హ్హాహాయ్ సిరి!! హే సాగర్ ఏంటి లేట్ ???వర్షం కదా...వోచము కానీ తగ్గే వరకు ఇక్కడే పక్కన షెడ్ లో వున్నాము.... 

వీడు నా ఫ్రెండ్ చంద్రశేఖర్!! తాను సిరిచందన ,సరయు బెస్ట్ ఫ్రెండ్ ర.. హ తెలుసు రా ఒకసారి సరయు ఫొటోస్ చూపెడుతూ చెప్పింది... ఒకటి రెండు సార్లు వాళ్ళ రూం దగ్గర చూసాను.. 

అప్పుడు గుర్తొచ్చింది సిరి కి చందు అని సరయు ఎక్కువ గ చెప్పేది ఈ అబ్బాయి గురించెనని.. నాన్న చిన్నప్పుడే వదిలేసి వెళ్లిన, ఇంటి పక్కనే ఉంటూ నన్ను సొంత చెల్లిలా ఒక్కోసారి నాన్న ల చూసుకునే వాడె మా చందు...వాడు లేకపోతే ఈ రోజు నేను అమ్మ తమ్ముడు ఇలా వుండేవాళ్ళమే కాదు.. వాళ్ళకి మేము పక్కింటి వాళ్లమే ఆయినా, సొంతింట్లో వాళ్లలా చూస్కుంటారు మా ఫామిలీ నీ...ఇదంతా చదు వల్లనే...వాడు నేను లేకుండా వుండలేదు...సో, తన చుట్టాలేవారు మా బంధాన్ని తప్పు గ అనుకోలేదు...మమ్మల్ని దూరాము చేయలేదు..

సరయు చెప్పిన విషయం గుర్తొచ్చి...సిరి కి చాల హ్యాపీ గ అనిపించింది ...

ఏంట్రా ఎం చూస్తున్నావు...పువ్వు తెచ్చివ్వాలా చెవుల్లో పెట్టుకుంటావా... రేయ్ సాగర్!!! కొడితే ఆరకు కాదు వెళ్ళేది హాస్పిటల్ కి...మేన బావ వి కాబట్టి కొట్టడం లేదు సంతోషించు... అబ్బా చాలు లేరోయ్!!! ఏంటి మొదటి పరిచయం లోనే సిరి కి ఫ్లాట్ అయిపోయావా??

దూరం నుండి చూస్తే ఏమో అనుకున్నాను...నార్మల్ గ ఎవరికీ ఆయినా ఫ్రెండ్స్ వుంటారు అనుకున్నాను కానీ తనేంటి ర దేవకన్యాలా వుంది.. ట్రైన్ లో నుండి బైటకు నించుంటే...గాలి కి తన వెంట్రుకలు ఎగురుతూ ఉంటే , చినుకులు తన మొహాన్ని తాకుతూ..తనని ముద్దడుతున్నాయి అనుకున్నాను..అంతలోనే గాలికి పువ్వులు తన పైన పడి ప్రేమ గ తనని స్పర్శించాయి అనుకున్నాను... తానెవరు అని చాల తపన పడ్డాడు... కానీ తను నా చెల్లి కి బెస్ట్ ఫ్రెండ్ అని తెలిసాక నాలో ఏదో అలజడి...తనని దగ్గర గ చూడగానే గుండె వేగంగా కొట్టుకుంది...అందుకే ఇలా వొచెసాను..

అంటే బావ నువ్వు తనని ...అవును రా మొదటి సారి చూసినప్పుడే అనుకున్నాను...ఎవరో కానీ దేవత లా వుంది అని.. నాకు ఇలాంటి అమ్మాయి దొరికితే బాగుండు అని...కానీ తనే నాకు ఎదురు పడి ఇంత దగ్గర గ ఉన్నాక తనని ఎలా వొదులు కుంటాను... తొలి పరిచయం లోనే ఆ దేవత పాదాలకి దాసుడను అవుతాను... 

సిరి చంద్రశేఖర్ లవ్ బిగిన్స్...

A short story by Mounika Myadari (Vamika)


Rate this content
Log in

Similar telugu story from Romance