Mounika Myadhari

Drama Classics Children

4.0  

Mounika Myadhari

Drama Classics Children

జో అచ్యుతానంద...

జో అచ్యుతానంద...

3 mins
405


అమ్మ !!!నా చిన్ని తండ్రి పిలుపుతో వెనకకు తిరిగి చూసాను.. చూడగానే కోపం వొచింది కానీ..తన చిన్ని పాదాల అచ్చులు చూసి , ఒక్క సరిగా కళ్లలో నీళ్లు తిరిగాయి.. మొదటి సారి న కన్నయ్య నడుస్తూ నా దగ్గరికి వొచ్చాడు..

ఎప్పుడు వెళ్ళాడో వంట గదిలోకి..నేను చూడనే లేదు.. ఇంటి వెనకాల బట్టలు ఉతుకుతు వున్నాను.. అప్పటి వరకు నా చుట్టే మెల్లిగా అంబాదుతూ అమ్మ అమ్మ ఉగ్గు ,గువ్వా,నాన్న,, మామ, తాత అంటూ తిరిగాడు..

గోడలు పట్టుకుని నడుస్తున్నాడు కదా..అలానే ఆడుకుంటూ ఉండి ఉంటాడు అనుకున్నాను.. చూసే సరికి పిండి మొత్తం పూసుకుని...తెల్లగా వున్నాడు.. అత్తమ్మ చూస్తే ఏంటి దేవకీ ఇది పిండాంత నేల పాలు చేసావేంటే..అని తిడుతుంది.. పిసినారి తాను...పిసినారి అని అనుకోవడము తప్పే అంది.. వాళ్ళు ఆలా కూడబెట్టి ఉండక పోయుంటే..ఈ రోజు మేము ఇలా సంతోషంగా ఒకరికి చేయి చాపకుండా బతికేవాళ్ళమే కాదు..

మామయ్య వ్యవసాయం చేస్తారు, అత్తమ్మ కి మామయ్య లోకం ఆయన వెంటే పొలానికి వెళ్ళేది.. పెళ్లి ఆయినా ఐదేళ్లకు పూజలు, వ్రతాలు చేస్తే పుట్టాడంట మా ఆయన.. చాలా గారాబంగా పెంచారు ఆయనని..మా పెళ్లి అయ్యి మూడేళ్లు అవుతున్న...ఏ రోజు నేను వంట గదిలోకి వెళ్ళలేదు.. రోజుకు మూడు పుటాలు అతయ్య వంట చేస్తుంది..

వుంది అయిదేకురాల పొలం...ఖర్చు అంతా ఇంతా కాదు మీకు తెలియనిదేముందండి..వోచే ఆదాయం లో సగం దాచిపెడుతూ సగం ఖర్చు చేసేది.. తనకోసం ఎప్పుడు మంచి బట్టలు కొకునేది కాదు అని చెప్పారు మా ఆయన..

ఏది ఎంత ఖర్చుపెట్టాలో అతయ్య చూసుకునే వారంతా..

అమ్మ!!నా కొడుకు మాట వినగానే ఆలోచన నుండి తేరుకున్నాను.. నవ్వుతు వెళ్లి వాణ్ణి హత్తుకున్నాను.. పుట్టిన సంవత్సరం నరకి నడిచాడు నా కొడుకు.. అందరం చాల భయప్పడ్డాము...నడక వొస్తుందో లేదో అని.. డాక్టర్ లు టైం పట్టొచ్చు భయపడకండి అని అన్నారు..

వాడి అడుగుల అచ్చులు చూస్తూ ఉంటె నా కళ్ళలోంచి నీరు పొంగుకొచ్చాయి..వాడిని హత్తుకుని..ముద్దులు పెట్టేసాను...నా సంతోషానికి హద్దులు లేవనుకోండి..

వాడిని శుభ్రం చేసి పడుకోపెట్టను..వంట గదిలో పిండి మొత్తం తీసేసి..అత్తమ్మ కి తెలియకూడదు అని పక్కనే వున్నా అబ్బాయి ని పిలిచి పిండి తెపిచి డబ్బాలో నింపేసాను...

నా కొడుకే పడేసాడు అని తెలిసినా..నన్నే తిట్టేస్తుంది అత్తమ్మ.. తన వైఖరి చూసి మొదట్లో బాధేసింది..మాది ప్రేమ పెళ్లి కావడం తో...ఆలా చేస్తుందేమో అనుకున్నాను.. కానీ అత్తమ్మ ప్రేమ అని నాకు మొదట ఓబోర్షన్ అయినప్పుడే తెలిసింది..అమ్మాయి నెలలు నిండక ముందే గర్భం లో చనిపోయింది..

న మనవరాలు ఇంటికి రాకుండానే వెళ్లిపోయిందండి..అని అత్తగారు అంటూ ఉంటే.. తను ఇంకా పూర్తిగా రూపం దలచుకోలేదు ...దీనికే ఇంత బాధ పడితే ఎలా.. మన ఇంటి లక్ష్మి దేవి ప్రాణాలతో వుంది అది చాలు..

కోడలు ని వల్లే కాలు జారి పడిపోయింది అని బాధపడ్డావు...ఎక్కడ తను మనకి దూరం అవుతుందో అని మాకంటే ఎక్కువగా నువ్వే తల్లడిల్లావు..చూడు తను బతికి బైట పడింది..మళ్ళి ఇంకో కానుపు లో ఆయన తనని జాగ్రత్త గ చూసుకుందాం, వేరే ఇంటి బిడ్డ అయిన..నీ సొంత కూతురు ల చూసుకుంటున్నావు...ఎప్పటికప్పుడు వాడికి ఫోన్ చేస్తూ...తనకి నచ్చిందల్లా కొనుకు రమ్మని గుర్తు చేసావు.. పెళ్లి ఆయన రోజు నుండి కాస్త గడుసు గ వున్నవే కానీ తనకి ఏమైనా తక్కువ చేసి చూస్కున్నావటే...ఎందుకు బాధ పడుతున్నావు ఇప్పుడు..

తనకి నువ్వే ధయిర్యం చెప్పాలి సుధా...

మామయ్య మాటలు విన్నాక అర్ధం అయింది..ఎక్కువ గ గారాభం చేస్తే నెత్తిన ఎక్కి కూర్చుంటాను అని అత్తమ్మ నాతో ఆలా ఉంటారని..ఆయన నాకోసం చేసే ప్రతిదీ అత్తగారి చలవే అని..

మొదటి గర్భం పోయింది రెండో గర్భం లో ఇంటి వారసుడిని కన్నాను కానీ వాడికి ఇంకా నడక రాలేదు.. పుట్టగానే అమ్మ ప్రేమ కి దూరం అయ్యాను..పెళ్లి కి ముందే నాన్న వెళ్ళిపోయారు.. నాకుందంటూ ఈ ఒక్క కుటుంబమే..అమ్మ నాన్న ల ప్రేమని చేపడ్తున్నారు అత్తమ్మ మామయ్య....

న కన్నయ్య ఆడుగులని పువ్వులతో అలంకరించాను.. అత్తమ్మ మామయ్య ఫంక్షన్ నుండి రాణే వోచారు..

అత్తమ్మ వంటగది వైపు వెళ్తూ వాడి ఆడుగులు చూసి మురిసిపోయింది.. 

నా కొడుకు నడిచినప్పుడు కూడా ఇంత ఆనంద పడలేదండి..న మనవాడి పాదాలు చుడండి ఎంత ముందు గ వున్నాయో.. వాడి పాదాల్లోనే ప్రపంచం కనిపిస్తూ వుంది...ఆ చిన్ని కృష్ణుడి మన ఇంటికి వొచినట్టు గ వుంది కదా అని... వాడి పాదాలని ముద్దు పెట్టుకుంది..

మా ఆయన గురించి చెప్పనవసరం లేదు..కొడుకు పాదాలని ముద్దడుతు వున్నాడు..

ఇద్దరు అత్తమ్మ కుచిలే, వెళ్లి తన ఒళ్లో పడుకున్నారు..

రోజు లగే జోల పాట..అందరం నిద్ర పోవాల్సిందే తన పాత కి..ఎప్పుడు వినేదే ఆయినా..తన ప్రేమ అలాంటిది..

నన్ను వాడి ఒళ్ళో పడుకో పెట్టుకుని తల నిమురుతూ జో అచ్చు జో అచ్చు అని నిద్ర పొ అంటాడు న కన్నయ్య..

జో అచ్యుతానంద జో జో ముకుందా..

లాలీ పరమానంద రామ గోవిందా జో జో..

కాలమషం లేని ఆ మొకం, ముంగురులు వెంట్రుకలు, చిట్టి పెదాలు.. ఎర్రగా పండిన గోరింటాకు చేతులు.. బుజ్జి బొజ్జ..బంగారు పాదాలు.. 

ఆ పాదాలు చేసిన చేమత్కారం ఏంటో తెలీదు నా ప్రపంచం ఎప్పుడు చుక్కలు నిండిన వెన్నెలతో చల్లని ప్రేమను కురిపించే చంద్రుడి వెలుగు తో నిండి పోయింది..

ఆ రాతిరి నా కొడుకు పాదాలు చూస్తూ గడిపేశాను...చిన్ని పాదాలు ఎన్నో జ్ఞాపకాలని గుర్తు చేశాయి..

అన్నట్టు చెప్పలేదు కదా...ఈ దేవకి వాసు ల కొడుకు పేరు అచ్యుత్..❤️❤️❤️❤️


Rate this content
Log in

Similar telugu story from Drama