Shaik Sameera

Thriller

3  

Shaik Sameera

Thriller

ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

5 mins
250


            ఎపిసోడ్ -14

రిథిమాని తీసుకొని రాజ్ ,డిసోజా లోపలికి తీసుకొస్తారు అక్కడ వంశ్ ఉంటాడు .

వంశ్ -రిథిమాని చూసి వంశ్ ప్రపంచం ఒక తెరిచి ఉన్న ఆకాశం కాదు స్వేచ్ఛగా ఎగరడానికి ఒక పంజరం లాంటిది దాని తలుపులు అప్పుడు తెరుచుకుంటాయి ఎప్పుడు నేను సైగ చేస్తానో అంటాడు .

రిథిమా -నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను .Resign చేశాను నేను అంటుంది .

వంశ్ -పేపర్ ముక్కలతో నన్ను ఎదిరించలేవు రిథిమా .తను ఇచ్చిన లెటర్ తీసి ముక్కలుగా చించి కింద పడేస్తాడు .డిసోజా ఒక ప్లేట్ తీసుకొని వస్తుంది .అది చూసి వంశ్ resign జాబ్ లో చేస్తారు నువ్వు ఇక్కడ ఇప్పుడు జాబ్ చెయ్యట్లేదు కానీ దానికి అర్థం ఇది కాదు పంజరం నుండి నిన్ను వదిలేసానని .నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళలేవు ఎప్పటివరకు నీది లేదా నాది మన ఇద్దరిలో ఎవరి శ్వాస అయిన ఆగిపోయేంతవరకు .వంశ్ రాయ్ సింఘానియా ఈ పేరు అంటే చాలా అసహ్యం ఉంది కదా నీకు .కానీ ఇప్పుడు ఈ పేరే నీకు కొత్త ఐడెంటిటీ ఇస్తుంది .ఈరోజు నుండి 3రోజుల తరువాత నువ్వు MS.రిథిమా కాదు MRS.రిథిమా వంశ్ రాయ్ సింఘానియా అయిపోతావు .రిథిమా షాక్ అయ్యి రాజ్ ,డిసోజా వైపు చూస్తుంది .డిసోజా తెచ్చిన ప్లేట్ పైన ఉన్న క్లోత్ తీస్తాడు వంశ్ అందులో కుంకుమ ఉన్న పెట్టే ,మంగళసూత్రం ,గాజులు ,నగలు ,పూలు ఉంటాయి .

వంశ్ కుంకుమ పెట్టే తీసి రిథిమా కి చూపిస్తూ ఇప్పటివరకు ఎవరికైతే శాపాలు పెట్టావో ఈ కుంకుమ అతని ఆయుష్షు పెంచమని అడిగేలా చేస్తుంది .నువ్వు నా నుంచి దూరంగా వెళ్లాలనుకున్నావు కదా ఈ గాజులు నాతో ముడివేస్తాయి నిన్ను .Resignation letter ఈ మంగళసూత్రం నా నుండి నిన్ను ఎప్పటికి దూరంగా వెళ్లనివ్వదు .రిథిమా కోపంగా చూస్తూ ఉంటుంది .వంశ్ రిథిమా వెనక్కి వచ్చి రెడీ అయిపో వచ్చే సమయం కోసం ఆ సమయమే నీ డౌట్స్ కి సమాధానం చెబుతుంది .హద్దు దాటడం అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుంది నీకు అసహ్యం ,కోపం ,ప్రేమ ,అసూయ ,మోసం యొక్క హద్దు దాటుతావు ఇప్పుడు అని వెళ్ళబోతూంటాడు వంశ్ .

రిథిమా -ఆగండి MR.వంశ్ రాయ్ సింఘానియా నేను ఈ బంధాన్ని నిరాకరిస్తున్నాను .మీ పవర్ ,మీ డబ్బు ,మీ బెదిరింపు ఇవన్నీ మిమ్మలన్నీ పెళ్లి చేసుకోడానికి నన్ను ఫోర్స్ చేయలేవు .ఏదైనా జోక్ జరుగుతుందా ఇక్కడ .లేకపోతే నాతో ఏదైనా గేమ్ ఆడుతున్నారా ?,వంశ్ మాట్లాడకపోయేసరికి నేను మీతో మాట్లాడుతున్నాను అంటుంది .నేను మిమ్మలన్నీ పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు .మీరు నా జీవితాన్ని నిర్ణయించలేరు .మీరెవరు నా జీవితం గురించి నిర్ణయం తీసుకోవడానికి .ఏదైనా ప్రూవ్ చేయాలి అనుకుంటున్నారా లేదా మీ డౌట్స్ కోసం ఎవరినైనా ట్రాప్ చేయాలి అనుకుంటున్నారా లేదా మీ అహాన్ని హర్ట్ చేశానని నా మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నారా .ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటునారు ప్లీజ్ చెప్పండి అని అడుగుతూ బాధపడుతుంది .

వంశ్ -నవ్వుతూ interesting very interesting అంటాడు .ఇంత చిన్న బ్రెయిన్ లో ఎన్ని complicated థియరీస్ ఆలోచించావు ఇంత తక్కువ టైములో .నువ్వు ఏది ఆలోచిస్తావో అది ఆలోచించుకో నిజమేంటి అంటే ఈ ఇంట్లో ఎవరైనా ఒక్కసారి వస్తే ఇక్కడ నుండి ఎవరు వస్తారు ఎవరు వెళ్తారు అనేది రాత ,దేవుడు ,సమయం అనేవి నిర్ణయించవు వంశ్ నిర్ణయిస్తాడు.నువ్వు ఏదైనా మిగిలింది ఆలోచించుకోవచ్చు ఏదైనా డీల్ ,డబ్బు ,దయ లేదా నా ట్రాప్ ఏదైనా అనుకో నాకేం ప్రాబ్లెమ్ లేదు .నేను అలాగని నీ అంగీకారం అడగలేదు పెళ్లి కోసం నువ్వు వద్దు అనడానికి .నేను నీకు inform చేస్తున్నా నువ్వు నా భార్యవి కాబోతున్నావని అంతే అంటాడు .ఇప్పుడు అర్థం అయిందా పంజరం అంటే ఏంటో అని రిథిమా దగ్గరికి వచ్చి ఎగరడం ఒక్కటే ఆప్షన్ ఉంది నీ దగ్గర అంటాడు .

అనాధవి కానీ ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి పారిపోవాలని అనుకోవచ్చు నువ్వు .సేజల్ లేదా ఇంకా ఎవరైనా దగ్గరైన వాళ్ళు వాళ్ళకి ఏమైనా అవ్వొచ్చు అంటాడు .అది విని రిథిమాకి కబీర్ గుర్తుకొస్తాడు మనసులో రిథిమా కబీర్ ప్రాణాన్ని ప్రమాదంలో పడేయలేను అనుకుంటుంది .నిర్ణయం అయిపోయింది రిథిమా నీ జీవితం గురించి నేను నిర్ణయించాను తయారైపో MRS .రిథిమా వంశ్ రాయ్ సింఘానియా అవ్వడానికి అని చెప్పి వెళ్ళిపోతాడు .రిథిమా టెన్షన్ పడుతూ తన రూంలోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకొని రాయి లాంటి మనసు ఉన్న వంశ్ తనని తాను దేవుడు అనుకుంటూ తప్పు చేస్తున్నాడు తన అహంతో ఎంత మంది లైఫ్స్ తో ఆడుకున్నారో ఇప్పుడు నా లైఫ్ తో ఆడుకోవాలని చూస్తున్నాడు .నేను అలా జరగనివ్వను అనుకుంటూ ఏడుస్తుంది .

వంశ్ తన రూంలో పెళ్లి ఏర్పాట్లు 3రోజుల్లో చేయమని చెబుతూ ఉంటాడు .అప్పుడే తన రూమ్ లోకి వంశ్ నానమ్మ ,సియా వస్తారు .నానమ్మ వంశ్ నీతో మాట్లాడాలి అంటుంది .నానమ్మ ఇంపార్టెంట్ కాల్ మాట్లాడొచ్చా అని వంశ్ అడుగుతాడు .కుదరదు ఇప్పుడే మాట్లాడాలి నీతో ఫోన్ కట్ చేయమని చెప్పడంతో కట్ చేసేస్తాడు వంశ్ .నానమ్మ కూర్చొని మాట్లాడుకుందాం రండి అంటాడు కూర్చొని మాట్లాడే అంతా సమయం లేదు అంటుంది .వంశ్ ఇలా ఎలా రిథిమాని పెళ్లి చేసుకుంటానని నిర్ణయం తీసుకున్నావు .పెళ్లి అనేది ఇద్దరి వ్యక్తుల ఇష్టంతో జరగాలి అంతేగాని బలవంతంతో కాదు నీతో పెళ్ళికి రిథిమా ఒప్పుకుందా తన ఇష్టం చాలా ముఖ్యం ఇది బిజినెస్ కాదు నీ ఇష్టమొచ్చినట్టు చేయడానికి నీ నుండి ఇలాంటివి ఎప్పుడు ఆశించలేదు అని వంశ్ నానమ్మ అంటుంది వంశ్ తో .

వంశ్ నానమ్మ దగ్గరికి వచ్చి నానమ్మ నేను ఎందుకు ఈ పెళ్లి చేసుకుంటున్నాను అంటే అని చెప్పేలోపు సియా ఎందుకంటే అన్నయ్య రిథిమాని ప్రేమిస్తున్నాడు కాబట్టి అని చెబుతుంది అది విని వంశ్ నానమ్మ సంతోషపడుతుంది .నానమ్మ నిజమేనా వంశ్ అని అడుగుతుంది వంశ్ మాట్లాడకుండా ఉంటాడు ఇంత పెద్ద నిజం నాతో చెప్పకుండా ఎందుకు దాచావు ముందే చెప్పి వుంటే నీ ఇష్టం పైన ప్రాణాలే పెట్టేదాన్ని కదా రిథిమా అంటే నాకు చాలా ఇష్టం నాకు బాగా నచ్చింది కూడా అని వంశ్ కి డబ్బులతో దిష్టి తీసి సియాకి ఇచ్చి పెద్దవాళ్ళకి పంచమని చెప్పి పెళ్ళికి ఏర్పాట్లు చేయాలనీ సియాని తీసుకొని వెళ్ళిపోతుంది నానమ్మ .వంశ్ వాళ్ళు వెళ్ళాక నవ్వుతాడు .

రిథిమా నేను కేవలం కబీర్ కి మాత్రమే సొంతం నేను వంశ్ తో పెళ్లి చేసుకోను ఎట్టి పరిస్థితిలోను అనుకుంటూ వుండగా రిథిమా అంతరాత్మ అద్దంలో కనిపించి వంశ్ ఏదైనా చేయగలడు రిథిమా నువ్వు అతన్ని ఆపలేవు .వంశ్ పర్మిషన్ లేకుండా ఈ ఇంటి నుండి వెళ్లలేకపోయావు వంశ్ తో పెళ్లి అయితే అతని జీవితం నుండి ఎలా వెళ్లగలవు.నువ్వు నా నుండి నీ నుండి అయిన దూరంగా వెళ్లగలవు కానీ వంశ్ నుండి వెళ్ళలేవు వంశ్ చాలా మొండివాడు నువ్వు వంశ్ మొండితనానివి అయిపోయావు నువ్వు పూర్తిగా బందివి అయిపోతావు వంశ్ లైఫ్ లో అని అంటుంది .అందుకు రిథిమా వంశ్ రాక్షసుడు అతనితో పెళ్లి కాదు కదా ఎటువంటి రిలేషన్ కూడా పెట్టుకొను అంటుంది .రిథిమా అంతరాత్మ నువ్వు అరవడంతో నిజం మారిపోదు రిథిమా 3రోజుల్లో పెళ్లి అయిపోతే నీకే అలవాటు అయిపోతుంది అంటుంది అందుకు రిథిమా కోపంతో అద్దం పగలకొట్టేస్తుంది .ఏడుస్తూ కింద కూర్చుంటుంది రిథిమా .

వంశ్ అమ్మ అనుప్రియ 3రోజుల్లో వంశ్ పెళ్లి అది ఆ రిథిమాతో అని అనగానే ఇషాని అన్నయ్యకి ఆ రిథిమాలో అంతలా ఏం నచ్చింది తన depressing డ్రెస్సింగ్ స్టైల్ తను ఈ ఇంటి స్టాఫ్ గా ఉండటానికి కూడా పనికి రాదు అనగానే వంశ్ నానమ్మ ఇషాని తను నీకు కాబోయే వదిన ఇలాంటి మాటలు అనొద్దు అంటుంది .అది విని అనుప్రియ ఇలాంటి మాటల వలన ఎలాంటి లాభం లేదు వంశ్ కోరుకున్నట్టే జరుగుతుంది అంటుంది .వంశ్ పిన్ని మన వంశ్ కాస్టలీ వైన్ లాంటివాడు కానీ ఆ రిథిమా నార్మల్ వాటర్ లాంటిది తను ఎలా వంశ్ కి నచ్చింది అనగానే వంశ్ నానమ్మ రిథిమా చాలా మంచి సంస్కారం ఉన్న అమ్మాయి తను వంశ్ కి ఈడు జోడు అని చెబుతుంది .వంశ్ పిన్ని 3రోజుల్లో పెళ్లి ఏర్పాట్లు ఎలా చేయగలం అంటుంది .అందుకు అనుప్రియ నేను అన్ని arrangements చేపించేసాను సియాతో చెప్పాను రిథిమాకి షాపింగ్ లో హెల్ప్ చేయమని ఎందుకంటే మనకన్నా రిథిమా గురించి సియాకే ఎక్కువ తెలుసు అంటుంది .

రిథిమా ఇదే నా తలరాత లో రాసి ఉందా వంశ్ తో పెళ్లి నేను deeni నుండి ఎలా బయటపడగలను కబీర్ ని కూడా కాంటాక్ట్ చేయలేను అని వంశ్ ట్రాన్స్మిటర్ పగలకొట్టడం తలుచుకొని బాధపడుతూ వుంటే తన కాలికి గాజు పెంకు గుచ్చుకుంటుంది రక్తం వస్తుంది .కబీర్ కి కూడా వేలికి గాయం అయ్యి రక్తం వస్తుంది రిథిమాని తలుచుకుంటాడు రిథిమా నువ్వు ఇక్కడ వుంటే నా చిన్న గాయాన్ని కూడా నువ్వు భరించలేవు .ఎందుకో నువ్వేదో ప్రమాదంలో ఉన్నావని అనిపిస్తుంది రిథిమా నా మనసుకి ఈరోజు నువ్వు అనుకుంటూ ఉంటాడు .రిథిమా నేను ఎలాంటి ప్రమాదంలో ఇరుకున్నాను ఎలా తప్పించుకోవాలి . ఏం కోరుకుంటున్నాడు వంశ్ నేను అయితే తనని కబీర్ వరకు చేరుకోనివ్వను అనుకుంటుంది .వంశ్ ఆడే గేమ్ ఎవరు తెలుసుకోలేరు ఇంట్లో అప్పటివరకు జరిగిన ఇన్సిడెంట్స్ తలుచుకుంటాడు .రిథిమా అమాయకమైన మొహం వెనక మోసం లేదా ఇంకేదైనా దాగి ఉందా అది తెలుసుకోవడానికి నేను ఎలాంటి లిమిట్ ని అయిన క్రాస్ చేస్తాను అనుకుంటాడు .



Rate this content
Log in

Similar telugu story from Thriller