Shaik Sameera

Thriller


3  

Shaik Sameera

Thriller


ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

4 mins 154 4 mins 154

             ఎపిసోడ్ -15

వంశ్ స్టడీ రూంలో ఏదో ఫైల్స్ చూస్తూ వుండగా రాజ్ వచ్చి బాస్ ఈ పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు అని టెన్షన్ గా అడుగుతాడు వంశ్ ని .వంశ్ రాజ్ తో సూర్యుడి నుండి అంత వెలుగు ఎలా వస్తుంది అని తెలిసిపోతే ప్రతి దీపం సూర్యుడు అవ్వాలని అనుకుంటుంది అంటాడు నీకే అర్థం అవుతుంది రాజ్ సమయం తో అని షీరా ఇవ్వు అంటాడు వంశ్ .రాజ్ వంశ్ కప్ బోర్డు నుండి సింహం తల ఉన్న బొమ్మ తీసి ఇస్తాడు .అది తీసుకొని వంశ్ అందులో ఉన్న పెన్ డ్రైవ్ ని లాప్టాప్ కి కనెక్ట్ చేసి ఇంకో గంటలో మన consignment షిప్ లో సేఫ్ గా డెలివరీ అయిపోతుంది ఎవరికీ తెలియదు మన ఇల్లీగల్ consignment అందులో ఉందని రాజ్ తో చెప్పి షీరా లాప్టాప్ నుండి తీసేస్తాడు .

షీరాని వంశ్ రాజ్ కి ఇచ్చి ఇది ఎవరి చేతికి దొరకకూడదు చాలా జాగ్రత్తగా కప్ బోర్డు లోనే పెట్టు నీకు తెలుసు కదా మాన్షన్ లో నాకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాల కోసం వెతుకున్నారని ఇది ఎవరికీ దొరకకూడదు.ఈ షీరా లో నా డీలింగ్స్ ,కాంటాక్ట్స్ ,బిజినెస్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి.వంశ్ ని అంతం చేసే శక్తి ఉంది దీనికి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పగానే రాజ్ షీరా కప్ బోర్డు లో పెట్టి లాక్ చేస్తాడు .వంశ్ అమ్మ అనుప్రియ వంశ్ గతం ,గతం తాలూకు గాయాలు మానడం అంత సులభం కాదు అనగానే వంశ్ నానమ్మ అనుప్రియ నిన్న మనమంతా అనుకున్నాము కదా వంశ్ గతం గురించి ఎవరు మాట్లాడకూడదని నిర్ణయం తీసుకున్నాము కదా ఆ నిర్ణయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి .గతాన్ని తలుచుకునే కొద్దీ బాధ కలుగుతుంది దాన్ని మర్చిపోయి ముందుకి వెళ్ళాలి ఈరోజు రాఖీపౌర్ణమితో పాటు వంశ్ నిశ్చితార్ధం కూడా ఉంది నాకు తెలియదు వంశ్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో తన పెళ్లి విషయంలో రిథిమాకి కూడా ఈ పెళ్లంటే ఇష్టం వుంటే వచ్చే సమయం మన ఇంట్లో సంతోషాలని తెస్తుంది అని చెప్పి వంశ్ నానమ్మ వెళ్ళిపోతుంది .

ఆర్యన్ రిథిమా ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకుంది అని అందరి ముందు అంటాడు.అప్పుడు అనుప్రియ వంశ్ గురించి మనందరికీ బాగా తెలుసు తను ఏదైనా కావాలి అనుకుంటే దాన్ని ఎలా అయిన సొంతం చేసుకుంటాడు కానీ ఈ పెళ్ళికి రిథిమా ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో అని అంటుంది .ఆర్యన్ మనసులో రిథిమా నన్ను తక్కువ చేయాలి అనుకుంది కానీ ఈ పెళ్లితో తనకి అర్థం అవుతుంది నరకం అంటే ఏంటో అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు .అందరూ హాల్ లో నిశ్చితార్థం కోసం రెడీ అయ్యి వస్తారు .వంశ్ అమ్మ అనుప్రియ సియాతో రిథిమాకి నిశ్చితార్థపు బట్టలు ఇచ్చావా అని అడుగుతుంది .అందుకు సియా తన రూమ్ దగ్గరికి వెళ్ళాను కానీ తను డోర్ తీయలేదు అందుకే బట్టలు డోర్ బయటే పెట్టి వచ్చేసాను అంటుంది .అనుప్రియ రిథిమాకి ఈ పెళ్లంటే ఇష్టం ఉందా లేదా తన మనసులో ఏముందో తెలియట్లేదు అంటుంది .అందుకు ఇషాని అసలు ఆ రిథిమాకి అంత స్థాయి లేదు నా అన్నయ్యని పెళ్లి చేసుకునేంత .అయిన ఇలాంటి అమ్మాయిలు ఇంత గొప్ప అవకాశాన్ని వదులుకోరు.ఇలాంటి అమ్మాయిలకి భర్త కన్నా అతని వెనక ఉన్న ప్రాపర్టీ అంటేనే ఇష్టం ఎక్కువ పెళ్లిమేళతాళాల కన్నా బంగారమే ఎక్కువ కనిపిస్తుంది అనగానే ఇషాని అని వంశ్ అరుస్తూ వస్తాడు .

వంశ్ ఇషాని దగ్గరికి వచ్చి రిథిమా ఇప్పుడు ఈ ఇంటి కోడలు అలాగే నీకు కాబోయే వదిన తనని గౌరవించడం నీ ఛాయిస్ కాదు నీ బాధ్యత అవుతుంది అలాగే తను ఈ ఫ్యామిలీలో భాగం కాబోతుంది నీకు తెలుసు కదా ఫ్యామిలీ కన్నా ఏది ఎక్కువ కాదని అంటాడు.ఇషాని సారీ మీరే నేర్పించారు కదా ఫ్యామిలీ కన్నా ఏది ఎక్కువ కాదని అని వెటకారంగా అంటుంది .వంశ్ రిథిమా ఎక్కడ ఉంది ఇంకా రాలేదా అని అడుగుతాడు నానమ్మని .తను రాదేమో అంటుంది అనుప్రియ.వంశ్ పిన్ని చంచల కూడా ఎవరైనా అడిగారా తనని అసలికి పెళ్లంటే ఇష్టం ఉందా లేదా అని అనగానే వంశ్ కి రిథిమా పెళ్ళికి ఒప్పుకోకపోవడం గుర్తొచ్చి నేను వెళ్లి తీసుకొస్తాను అని వెళ్లబోతాడు రిథిమా కోసం .

రిథిమా నిశ్చితార్థం కోసం తెచ్చిన బట్టలు వేసుకొని మెట్లు దిగుతూ ఉంటుంది వంశ్ రిథిమాని స్టన్నింగ్ గా చూస్తూ ఉంటాడు తనని .రిథిమా మెట్లు దిగి వంశ్ కి ఎదురుగా నిలబడుతుంది.ఇషాని మనసులో god డబ్బు మీద ఆశ తనని లాక్కొచ్చింది అని అనుకుంటుంది.వంశ్ రిథిమాని చూసి interesting కొన్ని గంటల ముందు ఎవరి కళ్ళలో అయితే అసహ్యం మాటల్లో విషం ఉందో తను ఇంత తొందరగా మారిపోయిందా రాజీ పడటం అంటే ఏంటో అర్థం అయింది అనుకుంటా అంటాడు .అందుకు రిథిమా orphanage లో పెరిగాను అక్కడ ఒకటి బాగా అర్థం అయింది నాకు ప్రతి మనిషి కోపం,విరోధం ఒక హద్దు వరకే చేయగలడు.దాన్ని బట్టి నేను కూడా పరిస్థితులకి తలవంచి రాజీ అనే దారిని ఎంచుకున్నాను అయిన మీరు ఏ దారి వదలేదు మీరు నాకోసం అంటుంది .అది విని వంశ్ గుడ్ అంటాడు.అనుప్రియ సియా చెప్పింది నువ్వు తలుపు తీయలేదని నీకు పెళ్లి అంటే నిజంగా ఇష్టం ఉందా అని అడుగుతుంది .అందుకు రిథిమా నేను పెళ్ళికి ఒపుకున్నానని షాక్ అవుతున్నారా లేదా మీ కొడుకు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నందుకు షాక్ అవ్వట్లేదా అని అనగానే అనుప్రియ మాట్లాడకుండా ఉండిపోతుంది .రిథిమా వంశ్ ని చూసి నేను మీ నిర్ణయంతో మొదట భయపడ్డాను నాకు తెలుసు మీకు పెళ్లి అనే ఈ బంధం మీద మీకు నమ్మకం లేదు కానీ ప్రతి అమ్మాయి పెళ్లికోసం కలలు కంటుంది.ఏ రోజు అయితే తన పెళ్లి కుదురుతుందో ఆ రోజు నుండి తన జీవితం మారిపోతుంది.పెళ్లి ఒక అమ్మాయికి కొత్త బంధాలన్నీ ముడివేస్తుంది.మీకు అనిపించవచ్చు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలని మీరు నిర్ణయించుకున్నారని కాదు భగవంతుడే మిమ్మలన్నీ అలా ఆలోచించేలా చేసాడు.అందుకే నా జీవితాన్ని భగవంతుడి పైనే వదిలేసాను తనే నాకు సహాయం చేస్తాడు.భగవంతుడు మీద నమ్మకంతో ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అంటుంది .అప్పుడు వంశ్ నానమ్మ రిథిమా నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది నీలాంటి అమ్మాయి నా వంశ్ జీవితంలోకి రావడం చాలా ఆనందంగా ఉంది నిశ్చితార్థపు వేడుక ఆరంభిద్దాం అంటుంది .

వంశ్ &రిథిమా సోఫాలో కూర్చుంటారు .వంశ్ అమ్మ అనుప్రియ నిశ్చితార్థపు ఉంగరం వంశ్ కి ఇస్తుంది రిథిమాకి తొడగమని రిథిమా మనసులో నేను బలహీనపడకూడదు నేను ఇది చేసి తీరాలి కబీర్ కోసం అని అనుకుంటూ కబీర్ తన చేతికి ఉంగరం తొడగటం గుర్తు వస్తుంది.వంశ్ రిథిమా చేతికి ఉంగరం తొడుగుతాడు అందరూ చప్పట్లు కొడతారు.వంశ్ కి కూడా రిథిమా ఉంగరం తొడుగుతుంది.నిశితార్థం అయిపోయాక వంశ్ నానమ్మ ఇద్దరినీ భగవంతుడి ఆశీర్వాదం తీస్కోండి అని చెబితే వంశ్ నాకు నమ్మకం లేదు అంటాడు.రిథిమా నాకు నమ్మకం ఉంది అని నానమ్మ తో పాటు పూజాగదిలోకి వెళ్తుంది.రిథిమా పూజగదిలో దీపం వెలిగించి వంశ్ రాజ్ తో షీరా గురించి చెప్పిన మాటలు వింటుంది.

రిథిమా మనసులో వంశ్ ఇల్లీగల్ బిజినెస్ గురించి దానికి సంబంధించిన ప్రూఫ్స్ కబీర్ కి అందించడానికే పెళ్ళికి ఒప్పుకున్నట్టు నాటకం చేస్తున్నట్టు దేవుడు ముందు ఒప్పుకుంటుంది .వంశ్ కి శిక్ష పడేలా చేస్తానని అనుకుంటూ మొబైల్ లో మాట్లాడుతున్న వంశ్ ని చూస్తుంది వంశ్ కూడా తనని చూస్తాడు.వంశ్ చేసిన తప్పులకి జైల్ కి పంపాలి అని దేవుడు ముందు దండం పెట్టుకుంటూ వంశ్ ని కోపంతో చూస్తూ ఉంటుంది .వంశ్ కి రాఖి కడుతూ ఉంటారు ఇషాని ,సియా రిథిమా అందరూ బిజీ గా ఉన్నారని వంశ్ స్టడీ రూంలోకి ప్రూఫ్స్ వెతకడానికి వెళ్తుంది.రిథిమా స్టడీ రూమ్ లోకి వెళ్లి షీరా ని చూడకపోవడం వలన ఫైల్స్ వెతుకుతూ ఉంటుంది కానీ వంశ్ తలుపు తీసుకొని లోపలికి వస్తాడు రిథిమా కప్ బోర్డు లో దాక్కుంటుంది వంశ్ చూడకుండా .Rate this content
Log in

More telugu story from Shaik Sameera

Similar telugu story from Thriller