ప్రేమ సంఘర్షణ
ప్రేమ సంఘర్షణ




ఎపిసోడ్ -5
వంశ్ తన ఫ్యామిలీ మొత్తానికి స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ ఆరెంజ్ చేసి వాళ్ళకి సర్ ప్రైజ్ చేస్తాడు .ఫ్యామిలీ మొత్తం వంశ్ ని king of sea అని పొగుడుతూ ఉంటారు .వంశ్ సియా కి సర్వ్ చేస్తూ రిథిమా ని చూస్తూ ఉంటాడు .సియా అది చూసి రిథిమా చాలా మంచి అమ్మాయి మంచి ఫీజియోథెరపిస్ట్ అని చెబుతుంది .రిథిమా థియేటర్ రూంలో తన క్లిప్ ఎక్కడ పడిపోయిందో సముద్రంలో పడిపోయిందేమో అని ఆలోచిస్తూ ఉంటుంది .సముద్రంలో పడిపోవడమే బెటర్ లేకపోతే ఎవరికైనా దొరికితే నేను దొరికిపోయేదాన్ని అనుకుంటూ వుండగా వంశ్ వస్తాడు తన దగ్గరికి తనని చూసి టెన్షన్ లో అక్కడ స్క్రీన్ కి ఉన్న తాడు లాగేస్తుంది పేపర్స్ ,బెల్లూన్స్ వాళ్ళ ఇద్దరి మీద పడతాయి .
వంశ్ - కొంతమంది కొందరి లైఫ్ లోకి వాళ్ళ లైఫ్ మార్చడానికి వస్తారు లేదా వాళ్ళ లైఫ్ మారడానికి కారణం అవ్వడానికి వస్తారు అంటారు .
రిథిమా -అర్థం కాలేదు అంటుంది .ఏదైనా కావాలి అంటే చెప్పండి
వంశ్ -నువ్వే కావాలి అదే సియా కి ఫీజియోథెరపిస్ట్ లాగా మా ఇంటికి రావాలి తనకి ట్రీట్మెంట్ ఇచ్చి మాములుగా నడిచేలా చేయాలి సియా కి నీ మీద చాలా నమ్మకం ఉంది .
రిథిమా -సియా అంటే నాకు చాలా ఇష్టం .కానీ నన్ను అనుమానించి చంపబోయిన మీ దగ్గర నేను వర్క్ చేయను .
వంశ్ -ఈ ఆఫర్ నీకు చాలా లాభాన్ని ఇస్తుంది ఎంతైనా డబ్బు అడుగు ఇస్తాను .ఈ ఆఫర్ ని accept చేయి నీ లైఫ్ మారిపోతుంది .అయిన వంశ్ ఇచ్చే ఆఫర్ ని ఎవరు కాదనరు .
రిథిమా -డబ్బు కోసం నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని పోగొట్టుకోను సారీ కొంచెం సేపటిలో ఈ క్రూయిజ్ ముంబై పోర్ట్ కి రీచ్ అవుతుంది అక్కడితో మన ప్రయాణం ఎండ్ అయిపోతుంది .గుడ్ బై అని వెళ్ళిపోతుంది .
రిథిమా మనసులో కబీర్ తనకు ముందు చెప్పినట్టు వంశ్ ఏదైనా ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేయమని చెప్పడం గుర్తొస్తుంది .కబీర్ ప్లాన్ ప్రకారమే జరుగుతుందని క్రూయిజ్ నుండి తన లగేజీ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది .రిథిమా బయటికి వచ్చి క్యాబ్ ఎక్కి వెళ్ళిపోతుంది .క్రూయిజ్ పై నుండి రిథిమా వెళ్లడం వంశ్ చూస్తూ ఉంటాడు .వంశ్ కి రాజ్ కాల్ చేసి రిథిమా హాస్టల్ ముందు ఉన్నాను మొత్తం చెక్ చేశాను అని చెబుతాడు .రిథిమా నిజస్వరూపం ఇదేనా interesting very interesting అని కాల్ కట్ చేస్తాడు .
రిథిమా క్యాబ్ లో జరిగింది కబీర్ కి చెప్పాలని తన మొబైల్ తీసుకుంటుంది కానీ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయిఉంటుంది .రిథిమా క్యాబ్ డ్రైవర్ ని అడిగి చార్జర్ అడిగి ఛార్జ్ పెట్టుకొని కబీర్ కి కాల్ చేస్తూ వుండగా సిగ్నల్ కట్ అవ్వడం చూస్తుంది ఏమైంది సిగ్నల్ పోయింది అనుకుంటూ వుండగా క్యాబ్ డ్రైవర్ మేడం ఈ ఏరియా లో జామర్ ఉంది అందుకే సిగ్నల్స్ ఉండవు అంటాడు .ఏ ఏరియా ఇది నేను చెప్పింది ఈ అడ్రస్ కాదు అంటూ వుండగా క్యాబ్ V R మాన్షన్ లోకి వెళ్తుంది .రిథిమా ని ఒకామె వచ్చి లోపలికి తీసుకెళ్తుంది అక్కడ వంశ్ ఉంటాడు welcome to V R MANSION అంటాడు
రిథిమా -ఎందుకు ఇలా నన్ను బలవంతంగా తీసుకొచ్చారు
వంశ్ -నేను ఏదైనా ఆఫర్ ఇస్తే అవతలి వాళ్ళు దానికి ఎస్ అనాలసిందే అందుకే తీసుకొచ్చాను .
రిథిమా -నేను ఏదైనా ఆఫర్ రిజెక్ట్ చేస్తే నో అని అర్థం అంటుంది
వంశ్ - interesting very interesting .ప్రతి వస్తువుకి ఒక విలువ ఉంటుంది అలాగే ప్రతి మనిషికి ఒక విలువ ఉండాలి నీ విలువ ఎంతో చెప్పు అంత కంటే 10రెట్లు ఎక్కువ ఇస్తాను accept చేయి అంటాడు .
రిథిమా -నేను వస్తువుని కాదు మనిషిని .మనుషులని వస్తువుల్లా చూసే మీ దగ్గర నేను జాబ్ ఎప్పటికి చేయను అని చెప్పి వెళ్లబోతుంది .
సియా వచ్చి రిథిమా ని ఆపుతుంది ఇక్కడే ఉండు రిథిమా ప్లీజ్ నిన్ను చూస్తే ఒక ఫ్రెండ్ లాగా అనిపిస్తావు అంటుంది .రిథిమా అలాగే అని సియా కోసం ఒప్పుకుంటుంది .వంశ్ ని చూసి ఎప్పుడు జాయిన్ అవ్వాలి సార్ అని అడుగుతుంది .ఈరోజే జాయిన్ అవ్వాలి అలాగే నువ్వు ఇక్కడే ఉండిపోవాలి అంటాడు వంశ్ .ఇక్కడ ఎలా ఉండాలి అంటుంది రిథిమా .వంశ్ మా స్టాఫ్ అంతా మాతో పాటే ఉంటారు నీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి లోటు ఉండదు అంటాడు .రిథిమా నేను హాస్టల్ కి వెళ్లి లగేజీ తీసుకొని రావాలి అంటుంది .వంశ్ అవసరం లేదు నాతో పాటు రమ్మంటాడు రిథిమా ని .రిథిమా మనసులో వంశ్ ఇంట్లో స్థానం సంపాదించాను కబీర్ కోరుకున్నట్టే జరిగింది అని హ్యాపీ గా ఫీల్ అవుతుంది .వంశ్ రిథిమా ని ఒక రూము లోకి తీసుకెళ్తాడు ఆ రూమ్ హాస్టల్ లో తను ఉంటున్న రూమ్ లాగే రెడీ చూసి ఉండటం చూసి రిథిమా తన నిజం వంశ్ కి తెలిసిపోయిందేమో అని టెన్షన్ పడుతుంది .కబీర్ రిథిమా ఉన్న ఫొటోస్ వంశ్ చూస్తాడేమో అని రిథిమా భయపడుతుంది .